భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ టోక్యో ఒలింపిక్స్‌పై ఆశలు వదులుకోలేదు. సింగపూర్ ఓపెన్ రద్దు కారణంగా ఒలింపిక్స్ అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన శ్రీకాంత్.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ అర్హత టోర్నీలు.. ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్‌లను బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసింది. టోక్యో ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి మరోరోజు ప్రకటన విడుదల చేస్తామని పేర్కొంది. ఈ ప్రకటన సానుకూలంగా ఉంటుందని శ్రీకాంత్ భావిస్తున్నాడు.
"అర్హత టోర్నీల్లో ఆడుంటే ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకునేవాడిని. మొత్తం అర్హత ప్రక్రియకు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ ఏం చెప్తుందోనని ఎదురుచూస్తున్నా. ఒలింపిక్స్‌కు అర్హతపై కొంత ఆశతో ఉన్నా. బీడబ్ల్యూఎఫ్ ప్రకటన సహజంగానే నా అర్హతకు సానుకూలంగా ఉంటుందనే అనుకుంటున్నా" అని శ్రీకాంత్ తెలిపాడు.
ఇదీ చదవండి: సింధు అకాడమీకి విశాఖలో రెండు ఎకరాలు