ETV Bharat / sports

kidambi srikanth BWF: ఫైనల్​లో ఓడినా చరిత్రే - ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​

Kidambi Srikanth BWF: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అపురూప దృశ్యం చూడాలనుకున్న భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనుకున్న ఆశ నెరవేరలేదు. కానీ ఓడినా.. శ్రీకాంత్‌ది సరికొత్త చరిత్రే. ఈ టోర్నీలో ఇప్పటివరకు ప్రకాశ్‌ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్‌ (2019) కాంస్యాలు సాధించగా.. రజత పతకంతో మెరిసిన శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

Kidambi Srikanth
కిదాంబి శ్రీకాంత్​
author img

By

Published : Dec 20, 2021, 9:16 AM IST

Kidambi Srikanth BWF: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ రజతం సాధించాడు. తొలి రౌండ్‌ నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న శ్రీకాంత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 15-21, 20-22తో లో కీన్‌ యూ (సింగపూర్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ జోరు, స్ట్రోక్‌లు చూసినవాళ్లకు భారత ఆటగాడిదే స్వర్ణమని అనిపించింది. అయితే అనవసర తప్పిదాలు శ్రీకాంత్‌కు బంగారు పతకాన్ని దూరం చేశాయి. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

43 నిమిషాల హోరాహోరీ పోరులో అనవసర తప్పిదాలు శ్రీకాంత్‌ను మూల్యం చెల్లించుకునేలా చేశాయి. ఆట, నైపుణ్యం, స్ట్రోక్‌ల పరంగా కీన్‌ కంటే శ్రీకాంత్‌ ఎంతో మెరుగ్గా కనిపించాడు. స్మాష్‌లు, డ్రాప్‌లు, బ్యాక్‌హ్యాండ్‌ రిటర్న్స్‌లతో అత్యుత్తంగా ఆడాడు. తొలి గేమ్‌ ప్రథమార్ధం వరకు శ్రీకాంత్‌కు ఎదురేలేదు. మొదటి పాయింటును కోల్పోయినా.. వెంటనే పుంజుకున్నాడు శ్రీకాంత్‌. 3 పాయింట్ల వరకు స్కోరు సమంగా కదిలింది. అక్కడ్నుంచి శ్రీకాంత్‌ ఒక్కసారిగా గేరు మార్చాడు. వరుసగా 6 పాయింట్లతో అదరగొట్టాడు. 9-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో శ్రీకాంత్‌కు ప్రత్యర్థి పోటీగానే కనిపించలేదు. విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో ఉన్న శ్రీకాంత్‌ అనంతరం లయ తప్పాడు. కీన్‌ దూకుడుగా ఆడుతూ పాయింట్లు రాబట్టాడు. 12 పాయింట్ల వద్ద శ్రీకాంత్‌ను అందుకున్నాడు. 14-13తో కీన్‌ ఆధిక్యం సంపాదించాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌ అనవసర తప్పిదాలూ ప్రత్యర్థికి కలిసొచ్చాయి. 13-17తో వెనుకబడిన శ్రీకాంత్‌ ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు. శ్రీకాంత్‌ స్మాష్‌లు కోర్టు బయటకు వెళ్లాయి. దీంతో 15-19తో ప్రత్యర్థి తొలి గేమ్‌కు చేరువయ్యాడు. శ్రీకాంత్‌కు మరో అవకాశం ఇవ్వకుండా 21-15తో తొలి గేమ్‌ గెలుచుకున్నాడు.

తొలి గేమ్‌ 16 నిమిషాల్లోనే ముగియగా.. రెండో గేమ్‌ 27 నిమిషాల పాటు సాగడం విశేషం. గేమ్‌ ఓడితే మ్యాచ్‌ పోతుంది కాబట్టి శ్రీకాంత్‌ ప్రాణం పెట్టి ఆడాడు. ప్రత్యర్థి కూడా అదే స్థాయిలో ఆడటం వల్ల 4 పాయింట్ల వరకు గేమ్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. అద్భుతమైన స్మాష్‌, డ్రాప్‌ షాట్లతో రెండు పాయింట్లు నెగ్గిన శ్రీకాంత్‌ 6-4తో ఆధిక్యం సంపాదించాడు. అయితే పట్టుదలగా ఆడిన కీన్‌.. శ్రీకాంత్‌కు భారీ ఆధిక్యం ఇవ్వలేదు. 9 పాయింట్ల వద్ద శ్రీకాంత్‌ను చేరుకున్న కీన్‌.. 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. విరామం తర్వాత కీన్‌ ర్యాలీ గేమ్‌ ఆడగా.. శ్రీకాంత్‌ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 3 అనవసర తప్పిదాలు శ్రీకాంత్‌కు కలిసొచ్చాయి. భారత ఆటగాడు 15-14తో ఆధిక్యం సంపాదించాడు.

సుదీర్ఘంగా సాగిన ర్యాలీని క్రాస్‌కోర్ట్‌ నెట్‌ షాట్‌తో తెరదించి 16-14తో రెండో గేమ్‌ దిశగా సాగాడు. అయితే కీన్‌ అద్భుతమైన డ్రాప్‌ షాట్‌తో శ్రీకాంత్‌ ఆధిక్యం 16-15కు తగ్గింది. శ్రీకాంత్‌ కూడా నెట్‌ దగ్గర అద్భుతంగా ఆడి 17-15తో ముందంజ వేశాడు. ఆ వెంటనే స్మాష్‌కు ప్రయత్నించిన శ్రీకాంత్‌ షటిల్‌ను నెట్‌కు కొట్టాడు. తర్వాతి ర్యాలీని అనుకూలంగా ముగించిన శ్రీకాంత్‌ 18-16తో ఆశలు రేకెత్తించాడు. వరుసగా 2 అనవసర తప్పిదాలు శ్రీకాంత్‌ను దెబ్బతీశాయి. 18-18తో స్కోరు సమమైంది. బాడీలైన్‌ స్మాష్‌తో కీన్‌ 19-18తో ఆధిక్యం సంపాదించాడు. శ్రీకాంత్‌ షాట్‌ నెట్‌కు తాకడం వల్ల కీన్‌ 20-18తో మ్యాచ్‌ పాయింటుకు చేరుకున్నాడు. మరో పాయింటు గెలిస్తే ప్రత్యర్థిదే మ్యాచ్‌. అయినా శ్రీకాంత్‌ వెనక్కి తగ్గలేదు. కళ్లు చెదిరే స్మాష్‌, అద్భుతమైన నెట్‌ గేమ్‌తో రెండు పాయింట్లు రాబట్టాడు. 20-20తో పాయింట్లు సమమయ్యాయి. ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో శ్రీకాంత్‌ పొరపాటు కీన్‌కు కలిసొచ్చింది. దీంతో 21-20తో ముందుకెళ్లిన కీన్‌.. విజయానికి కావాల్సిన పాయింటునూ గెల్చుకుని శ్రీకాంత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. మరోవెపు మహిళల సింగిల్స్‌లో యమగూచి (జపాన్‌) 21-14, 21-11తో తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

"ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరడం ప్రత్యేకం. ఇందుకోసం నేను చాలా కష్టపడ్డాను ఫైనల్లో రెండు గేముల్లోనూ నాకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ సరిగ్గా ముగించలేకపోయాను. లో బాగా ఆడాడు. ఈ కష్టాన్ని కొనసాగిస్తా. వచ్చే ఏడాది చాలా టోర్నీలున్నాయి. కామన్వెల్త్‌, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. వీటన్నింటిలో సత్తా చాటడానికి ప్రయత్నిస్తా."

- శ్రీకాంత్‌

గర్వంగా ఉంది

"శ్రీకాంత్‌ అద్భుతంగా ఆడాడు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించాడు. మంచి పోరాటస్ఫూర్తి కనబరిచాడు. ఫైనల్లోనూ శ్రీకాంత్‌ అవకాశం ఉంది. కాని కొన్ని పొరపాట్లతో మ్యాచ్‌ దూరమైంది. ముఖ్యంగా రెండో గేమ్‌లో. శ్రీకాంత్‌ తన పొరపాట్లతో స్వర్ణం కోల్పోయాడు. ఆట పరంగా ప్రత్యర్థి కంటే శ్రీకాంత్‌ అత్యుత్తమంగా కనిపించాడు. మొత్తంగా శ్రీకాంత్‌ది మంచి ప్రదర్శనే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించడం గొప్ప ఘనత. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రీకాంత్‌ ఈస్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. కోచ్‌లు, ఫిజియోలు, ట్రెయినర్లు, గోపీచంద్‌ అకాడమీ సమిష్టిగా అతని కోసం కష్టపడ్డారు. మొదట్నుంచీ అండగా నిలుస్తున్న భారత బ్యాడ్మింటన్‌ సంఘం, భారత క్రీడాప్రాధికార సంస్థకు కృతజ్ఞతలు."

- పుల్లెల గోపీచంద్‌, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌

శ్రీకాంత్‌ ప్రధాన విజయాలు

  • 2014 చైనా ఓపెన్‌
  • 2015 ఇండియా ఓపెన్‌
  • 2017 సింగపూర్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌
  • 2018 కామన్వెల్త్‌ క్రీడల మిక్స్‌డ్‌ టీం స్వర్ణం
  • 2018 కామన్వెల్త్‌ క్రీడల పురుషుల సింగిల్స్‌ రజతం

ఇదీ చూడండి : ఒడిశా ఆటగాడికి సీఎస్కే ఆహ్వానం.. ట్రయల్స్​కు రావాలని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.