కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ను జపాన్‌కు చెందిన కెంటో మొమొటా కైవసం చేసుకున్నాడు. సెమీస్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ను ఓడించిన ఈ షట్లర్.. ఫైనల్లో చో టియాన్ (తైవాన్)పై గెలుపొందాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో 21-19, 21-17 తేడాతో గెలిచి టైటిల్ సాధించాడు.
2016లో చట్టవిరుద్ధమైన కాసినోను సందర్శించి కెంటో... అదే ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం కోల్పోయాడు. ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫామ్‌లోకి వచ్చిన ఈ ఆటగాడు, టోక్యో ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టాడు.
ఇదే టోర్నీ మహిళల విభాగంలో చైనా క్రీడాకారిణి హి బింగ్జావో విజేతగా నిలిచింది. ఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి రచనోక్‌పై 18-21, 24-22, 21-17 తేడాతో గెలుపొందింది.
ఇవీ చూడండి.. యువరాజ్ ఫొటోకు సానియా కామెంట్