యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీ మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో భారత షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇండోనేషియా ఆటగాళ్లు మహ్మద్ అహ్సన్, హెంద్ర సెతివాన్తో గురువారం తలపడిన రెండో రౌండ్లో 19-21, 17-21 తేడాతో ఓడిపోయారు. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియగా.. తొలి సెట్లో సాత్విక్, చిరాగ్ కొంత పోటీ ఇచ్చినా తర్వాతి సెట్లో పూర్తిగా వెనుకపడిపోయారు. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.
అంతకుముందు దక్షిణ కొరియా ఆటగాళ్లు కిమ్ గి జంగ్, లీ యాంగ్తో తొలి రౌండ్లో తలపడిన సాత్విక్, చిరాగ్ జోడి 19-21, 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ చేజార్చుకొన్నా.. చివరి రెండు సెట్లలో విజయం సాధించారు. దీంతో దక్షిణ కొరియా జోడీపై విజయం సాధించిన భారత ఆటగాళ్లు తర్వాత ఇండోనేషియా జోడీతో ఓటమిపాలయ్యారు.
ఇదీ చూడండి: థాయ్ ఓపెన్: సైనా ముందడుగు.. మరో ఇద్దరికి పాజిటివ్