ETV Bharat / sports

ఆల్​ ఇంగ్లాండ్​ నుంచి సైనా, సింధు ఔట్ - All England Open 2020 latest infor

కరోనా వైరస్​తో ఇబ్బందులున్నా ఒలింపిక్స్​ అర్హత కోసం ఆల్​ ఇంగ్లాండ్​ టోర్నీలో అడుగుపెట్టిన సైనా, సింధు.. తీవ్రంగా నిరాశపర్చారు. సింధు క్వార్టర్స్​లో ఓడిపోగా.. సైనా తొలిరౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది. ఫలితంగా ఈ మెగాటోర్నీలో భారత ఆటగాళ్ల పోరు ముగిసింది.

Indian challenge ends as PV Sindhu crashes out in quarterfinals at All England Open 2020
ఆల్​ ఇంగ్లాండ్ నుంచి సింధు,సైనా ఔట్​
author img

By

Published : Mar 13, 2020, 10:25 PM IST

భారత షట్లర్ల పేలవ ఆటతీరు ఇంకా కొనసాగుతోంది. ఒలింపిక్స్​ అర్హతలో భాగంగా ర్యాంక్​ మెరుగుపర్చుకోడానికి బరిలోకి దిగిన టోర్నీలోనూ మనోళ్లు రాణించలేకపోయారు. కరోనా ఇబ్బందులున్నా ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వెళ్లిన భారత బృందం.. తీవ్రంగా నిరాశపర్చింది. ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో సింధు తప్ప ఒక్కరూ రెండోరౌండ్​ దాటలేకపోయారు.

ఒకుహుర​ చేతిలో సింధు...

సింధు ఇటీవల కాలంలో జపాన్​ ప్లేయర్ల చేతిలో ఓడిపోతోంది. తాజాగా జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్​లోనూ 21-12, 15-21, 13-21 తేడాతో నయోమి ఒకుహుర(జపాన్​) చేతిలో పరాజయం చెందింది.

సైనా తొలిరౌండ్​లోనే..

స్టార్​ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఆరంభ రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. సాయిప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, లక్ష్యసేన్‌ కూడా ఓటములతో టోర్నీ నుంచి ఔటయ్యారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 11-21, 8-21తో మూడో సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. వరుస సెట్లలోనే కనీస పోరాటం లేకుండా ఓడిపోయింది సైనా. టోక్యోకు అర్హత సాధించాలంటే వచ్చే నెల 28లోగా.. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-16లో సైనా చోటు సంపాదించుకోవాలి.

పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ 12-21, 13-21తో జున్‌ పెంగ్‌ ఝా (చైనా) చేతిలో ఓడాడు. కశ్యప్‌ మ్యాచ్‌ ఒక్క నిమిషం మాత్రమే జరిగింది. షెసర్‌ హిరెన్‌(ఇండోనేసియా)తో మ్యాచ్‌లో 0-3తో వెనుకబడిన సమయంలో.. కశ్యప్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వైదొలిగాడు.

రెండో రౌండ్‌కు చేరిన యువ సంచలనం లక్ష్య సేన్‌ 17-21, 18-21తో విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు.

మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-సిక్కిరెడ్డి ద్వయం.. మిసాకి మత్సుటొమో, అయక తకహషి చేతిలో ఓడిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.