టెన్నిస్ అగ్ర క్రీడాకారిణి సానియా మీర్జా... దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. పునరాగమనం చేస్తూనే అద్భుతమైన విజయం అందుకుంది. ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగిన హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ డబుల్స్ విభాగంలో విజయం నమోదు చేసింది.
తొలి రౌండ్లో సానియా- నదియా (ఉక్రెయిన్) 2-6, 7-6 (3), 10-3తో ఓక్సానా (జార్జియా)- మియు (జపాన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో వేనియా కింగ్- క్రిస్టినా మెక్‌హేల్ (అమెరికా) జంటతో సానియా జోడీ తలపడుతుంది.
"నా జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఇదొకటి. తల్లిదండ్రులు, బుల్లి తనయుడి సమక్షంలో మ్యాచ్ ఆడి గెలవడం ఆనందంగా ఉంది" అని ట్విటర్లో సానియా పేర్కొంది.
ఈ టోర్నీకి ముందు సానియా చివరిగా 2017 అక్టోబరులో చైనా ఓపెన్ ఆడింది. మోకాలి గాయం.. ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కారణంగా ఆటకు దూరమైంది.