ETV Bharat / sports

ఓ పెళ్లిలో కలుసుకొన్నారు.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.. - తెలంగాణ తాజా వార్తలు

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో సరికొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. అందుకే పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత పదిలంగా మార్చుకోవాలనుకున్నారు. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల- తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండున్నరేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట పెళ్లిపీటలెక్కేందుకు సమయం ఆసన్నమైంది. ఈనెల 22న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారీ లవ్‌ బర్డ్స్‌.

gutta jwala
గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌
author img

By

Published : Apr 16, 2021, 3:10 PM IST

గుత్తా జ్వాల... హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరో స్టార్‌ ప్లేయర్ అశ్వినీ పొన్నప్పతో కలిసి డబుల్స్‌ విభాగంలో భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు, పతకాలు అందించిందీ బ్యాడ్మింటన్‌ క్వీన్. 2010లో దిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఈ జోడీ 2011 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం, 2006, 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకాలు సొంతం చేసుకున్న వీరిద్దరూ.. డబుల్స్‌లో నంబర్‌వన్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈక్రమంలో కెరీర్‌ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తన సహచర ఆటగాడు చేతన్‌ ఆనంద్‌తో ప్రేమలో పడింది జ్వాల. చాలా కాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. అయితే ఆరేళ్లు కాపురం చేసిన ఈ జంట వ్యక్తిగత కారణాలతో 2011లో విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు.

తమిళ హీరోగా!

ఇక తమిళంలో మంచి నటుడిగా పేరు సొంతం చేసుకున్న విష్ణు ఇప్పటివరకు మొత్తం 14 సినిమాల్లో నటించాడు. నిర్మాతగా పలు చిత్రాలను కూడా తెరకెక్కించాడు. రానా హీరోగా ఇటీవల విడుదలైన ‘అరణ్య’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఈ హీరో 2010లో రజనీ నటరాజ్‌ అనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్‌ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా 2018లో విష్ణు, రజనీ విడిపోయారు.

అలా మొదలైంది!

వైవాహిక జీవితానికి సంబంధించి ఎదురు దెబ్బలు తిన్న వీరిద్దరూ విష్ణు విశాల్‌ సోదరి సంగీత్‌ వేడుకలో తొలిసారిగా కలిశారు. అప్పుడు వీరి మధ్య మొదలైన స్నేహం, ఆ తర్వాత ప్రేమగా చిగురు తొడిగింది. రెండున్నరేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోన్న ఈ ముద్దుల జంట.. పార్టీలు, ఫంక్షన్లకు కలిసే వెళ్తుంటారు. వెకేషన్స్‌లోనూ జంటగానే కనిపిస్తుంటారు. అయితే ఎప్పుడూ తమ ప్రేమ గురించి అధికారికంగా ప్రకటించని ఈ జంట.. సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్‌ చేసుకుంటూ మురిసిపోయేవారు. ఈ క్రమంలో గతేడాది జులై 17న విష్ణు పుట్టిన రోజు సందర్భంగా అతనికి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది జ్వాల. బర్త్‌ డే వేడుకలను సెలబ్రేట్‌ చేయడానికి హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లిన ఆమె ప్రియుడికి చెప్పకుండా అతని ఇంటి ముందు ప్రత్యక్షమైంది. అనంతరం అతడి పుట్టిన రోజు వేడుకలను దగ్గరుండి సెలబ్రేట్‌ చేసింది.

ఉంగరాలు మార్చుకొని!

ఇక గతేడాది సెప్టెంబర్ 7న 37 వ వసంతంలోకి అడుగుపెట్టింది జ్వాల. ఈసారి తన ప్రేయసి పుట్టినరోజును మరింత మధురంగా మార్చాలనుకున్న విష్ణు ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అప్పుడే తమ నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారీ లవ్‌ బర్డ్స్‌.

మీ ప్రేమ కావాలి!

ఇలా ఓ పెళ్లిలో మొదలైన జ్వాల-విష్ణుల పరిచయం స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమగా చిగురించి ఇప్పుడు మూడు ముళ్ల బంధంగా మారేందుకు రడీ అయింది. ఈనెల 22న ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు నడవనున్నారీ ప్రేమ పక్షులు. ఈ మేరకు తమ వివాహానికి సంబంధించిన లగ్న పత్రికను తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. ‘ఇరు కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో మేం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాం. ఈ శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ శుభకార్యం జరగనుంది. ఇక ఎన్నో ఏళ్లుగా మీరందరూ మాపై కురిపిస్తోన్న ప్రేమానురాగాలకు ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అంటూ ఆహ్వాన పత్రికలో రాసుకొచ్చారీ కాబోయే వధూవరులు.

త్వరలో పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించనున్న జ్వాల-విష్ణులకు ముందస్తు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండండి!’ అంటూ ఆశీర్వదిస్తున్నారు.

ఇదీ చదవండి: గుడిసెకు మంటలంటుకొని వృద్ధ దంపతులు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.