ETV Bharat / sports

'అర్జున అవార్డుకు ప్రణయ్​ను నామినేట్​ చేయాలి' - ప్రణయ్​ పేరును సూచించిన గోపిచంద్​

ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత షట్లర్​ హెచ్​.ఎస్​ ప్రణయ్​ పేరును ప్రతిపాదించాలని సూచించారు బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపిచంద్​. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం వల్ల వరుసగా రెండో ఏడాది ప్రణయ్​ పేరును సిఫార్సు చేయలేదు బీఏఐ.

pranay
ప్రణయ్​, గోపిచంద్​
author img

By

Published : Jun 21, 2020, 6:51 PM IST

అర్జున అవార్డుకు వరుసగా రెండో ఏడాది భారత షట్లర్​ హెచ్​.ఎస్​ ప్రణయ్​ పేరును భారత బ్యాడ్మింటన్​ సంఘం (బీఏఐ) సిఫార్సు చేయకపోవడంపై స్పందించారు బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపిచంద్​. అతడి పేరును ప్రతిపాదించాలని సూచించారు. అయితే జూన్​ 3వ తేదీనే ఈ విషయాన్ని గోపిచంద్​ చెప్పినట్లు.. భారత బ్యాడ్మింటన్​ సంఘానికి(బీఏఐ) సంబంధించిన ఓ అధికారి తెలిపారు.

సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి , సమీర్‌ వర్మ పేర్లను అర్జున అవార్డు కోసం కేంద్రానికి పంపించింది బీఏఐ. క్రమశిక్షణ ఉల్లంఘనల చర్యల కింద ప్రణయ్​ పేరును చేర్చలేదు. అయితే ఈ కారణం చేత బీఏఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ప్రణయ్​. దీనిపై స్పందించిన బీఏఐ.. షోకాజ్​ నోటీసులను జారీ చేసింది. 15 రోజుల్లో ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలిపింది.

ఇది చూడండి : ప్రమాదంలో వికెట్​కీపర్​ కారు నుజ్జు నుజ్జు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.