డెన్మార్క్ ఓపెన్‌లో భారత షట్లర్ సమీర్ వర్మ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన కంటా సునేయామాపై గెలుపొంది ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సమీర్.. 21-11, 21-11 తేడాతో విజయం సాధించాడు.
అంతకు ముందు జరిగిన మ్యాచ్‌ల్లో పీవీ సింధు, సాయిప్రణీత్ గెలుపొందారు. సింధు.. మరిస్కాపై కష్టపడి గెలవగా, సాయిప్రణీత్.. ప్రముఖ ఆటగాడు లిన్‌డాన్‌ను ఓడించాడు.
ఇది చదవండి: ఖరీదైన ఆటగాడికి.. జట్టులో దక్కని చోటు..!