థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించిన భారత యువ జోడీ సాత్విక్ సాయిరాజు-చిరాగ్‌శెట్టి.. తాజా ప్రపంచ బ్యాడ్మింటన్(బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. మంగళవారం విడుదలైన ఈ జాబితాలో వీరిద్దరి జోడీ డబుల్స్‌లో ఏడో ర్యాంక్‌కు చేరుకుంది.
ఇటీవల చైనా ఓపెన్‌లో వీరిద్దరూ సెమీఫైనల్‌కు చేరడం వల్ల.. తొమ్మిదో స్థానం నుంచి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నారు. టాప్-10లో నిలిచిన తొలి పురుషుల డబుల్స్ జోడీగా రికార్డులకెక్కారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన మూడో జోడీగా నిలిచారు. వీరి ద్వయం కంటే ముందు గుత్తా జ్వాల-దిజు వలియవీటిల్, గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప.. గతంలో టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
-
Unstoppable Duo!🚀
— BAI Media (@BAI_Media) November 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🇮🇳’s MD pair- @satwiksairaj & @Shettychirag04 achieved their career-best ranking as they become world number 7️⃣ in the latest #BWF Rankings.
Keep rising higher boys! 🔝 #IndiaontheRise #badminton pic.twitter.com/psTfHw835h
">Unstoppable Duo!🚀
— BAI Media (@BAI_Media) November 12, 2019
🇮🇳’s MD pair- @satwiksairaj & @Shettychirag04 achieved their career-best ranking as they become world number 7️⃣ in the latest #BWF Rankings.
Keep rising higher boys! 🔝 #IndiaontheRise #badminton pic.twitter.com/psTfHw835hUnstoppable Duo!🚀
— BAI Media (@BAI_Media) November 12, 2019
🇮🇳’s MD pair- @satwiksairaj & @Shettychirag04 achieved their career-best ranking as they become world number 7️⃣ in the latest #BWF Rankings.
Keep rising higher boys! 🔝 #IndiaontheRise #badminton pic.twitter.com/psTfHw835h
ఈ ఏడాది అదుర్స్..
- ఈ ఏడాది థాయ్‌లాండ్ సూపర్ 500 టోర్నీలో విజేతలైన సాత్విక్-చిరాగ్... ఆ టోర్నీలో మాజీ ఛాంపియన్లు లీ జున్ హుయ్-యు చెన్(చైనా)లను ఓడించారు.
- సూపర్ 750 టోర్నీ... ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నెం.6 జోడీ హిరోయికి-యుటా వటానబే జోడీకి చెక్ పెట్టారు. ప్రపంచ నెం.2 జోడీ హెండ్రా సెతియవన్-మహ్మద్ అహ్సన్(జపాన్)కు షాకిచ్చారు.
- ఇటీవల జరిగిన సూపర్ 750 టోర్నీ... చైనా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించారు.
నవంబర్ 12(మంగళవారం) నుంచి సూపర్ 500 టోర్నీ.. హాంకాంగ్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ ఫేవరెట్ జోడీగా బరిలోకి దిగుతున్నారు.
సాయి ప్రణీత్ ఒక్కడే..
ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్.. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. ఇంతటి అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ఏడో ఆటగాడిగా సాయి చరిత్ర సృష్టించాడు.
గతంలో ప్రకాశ్ పదుకొణె, పుల్లెల గోపీచంద్, చేతన్ ఆనంద్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ కిదాంబి, హెచ్ఎస్ ప్రణయ్ టాప్-10 జాబితాలో చోటు పొందారు.