బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో.. ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి, డిఫెండింగ్ ఛాంపియన్ పి.వి.సింధు రెండడుగులు వేయకుండానే ఇంటిముఖం పట్టింది.
గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్ యుఫెయ్(చైనా)చేతిలో ఓడిపోయింది సింధు. తొలి సెట్‌ను 22-20 తేడాతో కైవసం చేసుకున్న ఈ క్రీడాకారిణి... తర్వాత రెండు సెట్లలో తేలిపోయింది. ప్రత్యర్థి చేతిలో 21-16, 21-12 తేడాతో ఓడి ఇంటిముఖం పట్టింది.
-
Highlights | 🇨🇳 Chen Yu Fei finds another gear to break away and claim the deciding game against Pusarla V. Sindhu 🏸#HSBCBWFbadminton #HSBCWTFinals2019 #Guangzhou2019 pic.twitter.com/nUuJkCjNX9
— BWF (@bwfmedia) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Highlights | 🇨🇳 Chen Yu Fei finds another gear to break away and claim the deciding game against Pusarla V. Sindhu 🏸#HSBCBWFbadminton #HSBCWTFinals2019 #Guangzhou2019 pic.twitter.com/nUuJkCjNX9
— BWF (@bwfmedia) December 12, 2019Highlights | 🇨🇳 Chen Yu Fei finds another gear to break away and claim the deciding game against Pusarla V. Sindhu 🏸#HSBCBWFbadminton #HSBCWTFinals2019 #Guangzhou2019 pic.twitter.com/nUuJkCjNX9
— BWF (@bwfmedia) December 12, 2019
గ్రూప్-ఎ నుంచి రెండు మ్యాచ్‌లు గెలిస్తే సెమీఫైనల్‌కు చేరేది సింధు. అయితే బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సింధు 21-18, 18-21, 8-21తో అకానె యమగూచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. తాజాగా జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా భారత్ నుంచి మెగాటోర్నీలో అడుగుపెట్టిన ఒకే ఒక్క ఈ క్రీడాకారిణి.. ఆరంభంలోనే వెనక్కిమళ్లింది. నామమాత్రపు మూడో మ్యాచ్‌లో హే బింగ్జియో(చైనా)తో శుక్రవారం తలపడనుంది. సింధుపై గెలిచిన ఈ ఇద్దరు విజేతలు గ్రూప్-ఎ నుంచి సెమీఫైనల్లో అడుగుపెట్టారు.
ఒలింపిక్స్ ముంగిట కలవరం...
వచ్చే ఏడాది ఒలింపిక్స్ ముంగిట సింధు ఫామ్ అభిమానులను కలవరపెడుతోంది. ఈ ఏడాది బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన సింధు.. ఆ తర్వాత ఏ టోర్నీలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ మెగాటోర్నీ తర్వాత ఇండోనేసియా ఓపెన్ సూపర్ 750లో మాత్రమే ఫైనల్ చేరింది. అనంతరం జరిగిన అన్ని టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండా, గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.