మన దేశంలో జరగాల్సిన ఇండియా ఓపెన్ సూపర్ 500, హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 టోర్నీలను రద్దు చేస్తూ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మిగిలిన సీజన్‌కు సంబంధించి అంతర్జాతీయ క్యాలెండర్‌ను పునరుద్ధరించింది.
టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీ ఇండియా ఓపెన్ మే 11-16 వరకు జరగాల్సింది. కొవిడ్ కారణంగా ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ప్రకటించింది బీడబ్ల్యూఎఫ్. హైదరాబాద్ ఓపెన్‌ను ఆగస్టు 24-29 వరకు నిర్వహించాల్సి ఉండగా.. కొవిడ్ వల్ల ఆ టోర్నీని రద్దు చేసింది. సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ షెడ్యూల్ ప్రకారమే జరగనుందని ప్రకటించింది. లక్నవూ వేదికగా అక్టోబర్ 12-17 వరకు ఈ టోర్నీ జరగనుంది.
చైనా వేదికగా జరగాల్సిన సుదీర్మన్ కప్ ఫైనల్‌తో పాటు ప్రపంచ టూర్ ఫైనల్స్‌ను అక్కడి నుంచి తరలించింది. సుదీర్మన్ కప్‌కు ఫిన్లాండ్ ఆతిథ్యమివ్వనుండగా.. డబ్ల్యూటీఎఫ్ను ఇండోనేసియాలో జరపనున్నారు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్స్ టోర్నీకి స్పెయిన్ ఆతిథ్యమివ్వనుంది.
ఇదీ చదవండి: Gopichand: బ్యాడ్మింటన్‌లో మూడు పతకాలు ఖాయం