ETV Bharat / sports

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్ టోర్నీకి రంగం సిద్ధం! - ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్ని ప్రారంభం!

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నిని నిర్వహించేందుకు సిద్ధమైంది భారత బ్యాడ్మింటన్​ సంఘం. ఈ ఏడాది డిసెంబర్​లో లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ టోర్నీ జరుగుతుందని తెలిపింది. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని వెల్లిడించింది.

BAI ready to host India Open in December-January
ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్ని
author img

By

Published : Apr 29, 2020, 5:31 AM IST

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది భారత్​ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్). ఈ ఏడాది డిసెంబర్​ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ టోర్నీని జరుపుతామని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగి, ప్రభుత్వం అనుమతి ఇస్తేనే అది సాధ్యపడుతుందని స్పష్టం చేసింది. దీనిని జరిపితే షట్లర్లకు ఒలింపిక్​ క్వాలిఫయర్స్​కు అర్హత సంపాదించే అవకాశం దక్కుతుంది.

దిల్లీ వేదికగా మార్చి 24 నుంచి 29 వరకు ఇండియా ఓపెన్​ జరగాలి. కానీ కరోనా​ ప్రభావంతో వాటిని వాయిదా వేశారు.

అదే విధంగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య.. బీడబ్ల్యూఎఫ్​కు గతవారం ఓ మెయిల్ చేసింది. ప్రపంచ టూర్​లోని సూపర్​ 500 టోర్నీ నిర్వహణకు బీడబ్ల్యూఎఫ్ స్లాట్​ బుక్​ చేయాలని చెప్పింది. ఇందుకు ప్రతిగా స్పందిస్తూ ఈ డిసెంబర్​ లేదంటే వచ్చే జనవరిలో నిర్వహించేందుకు రెండు స్లాట్​లను కేటాయించింది భారత బ్యాడ్మింటన్ సమాఖ్య.

మరోవైపు బీడబ్ల్యూఎఫ్​ టూర్​తో పాటు ఇండోనేషియా ఓపెన్​ సూపర్​ 1000, జూనియర్​ అండ్​ పారా బ్యాడ్మింటన్​ పోటీలు వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి : ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టిన ఆర్​సీబీ కోచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.