ETV Bharat / sports

Badminton player Sathwik : ఒలింపిక్స్​లో తెలుగు రాకెట్.. పథకం సాధిస్తానని ధీమా! - బ్యాడ్మింటన్‌ తాజా వార్తలు

ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం ప్రతి క్రీడాకారుడి కల. ఏపీలోని అమలాపురం కుర్రాడు సాత్విక్‌ ఇరవై ఒక్క ఏళ్లకే ఆ ఘనత అందుకున్నాడు. ఐదేళ్ల నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఈ అర్జున అవార్డీ ఒలింపిక్స్‌లో పతకంతో తిరిగొస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. చిన్న పట్టణంలో పుట్టి, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా మేటి ఆటగాడుగా ఎదిగిన వైనంతో.. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

badminton-player-sathwik-confident-on-winning-medal-in-olympics
ఒలింపిక్స్​లో తెలుగు రాకెట్.. పథకం సాధిస్తానని ధీమా!
author img

By

Published : Jul 24, 2021, 9:16 AM IST

నాన్న తోడుగా రాకెట్‌ పట్టాడు.. సిమెంట్‌ కోర్టులో సాధన మొదలెట్టాడు.. గాయపడ్డా, ఆర్థిక ఇబ్బందులు వెనక్కి లాగుతున్నా లెక్క చేయలేదు.. దాతల సాయంతో పోటీలకెళ్లాడు.. దేశం గర్వించే విజయాలు సాధించాడు.. టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచి మూడు రంగుల జెండా ముద్దాడతానంటున్నాడు ఏపీలోని అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాడు సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి.

మొదట సింగిల్స్.. ఆ తర్వాత డబుల్స్..

సాత్విక్‌ నాన్న కాశీవిశ్వనాథ్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు. పిల్లలకు రకరకాల క్రీడల్లో శిక్షణనిచ్చేవారు. ఏడేళ్ల వయసులో ఆయనతో కలిసి బ్యాడ్మింటన్‌ కోర్టుకు వెళ్లేవాడు సాత్విక్‌. అక్కడ పిల్లలతో కలిసి ఆడుతూ మంచి ప్రతిభ చూపించేవాడు. విశ్వనాథ్‌ ఇది గమనించి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మెల్లగా జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో సింగిల్స్‌పైనే దృష్టిపెట్టినా తన ఆటతీరుకి డబుల్స్‌ అయితే సరిపోతుందని డబుల్స్‌ ఎంచుకున్నాడు. మొదట్లో తెలుగబ్బాయి కృష్ణప్రసాద్‌తో కలిసి ఆడినా, కర్ణాటక కుర్రాడు చిరాగ్‌శెట్టి భాగస్వామిగా మారాక అంతర్జాతీయ స్థాయిలో విజయాలతో దూసుకెళ్తున్నాడు.

ఇబ్బందులు దాటి

ఒకరకంగా చెప్పాలంటే బ్యాడ్మింటన్‌ ఖరీదైన ఆటే. మంచి సౌకర్యాలు, కోర్ట్‌, కోచ్‌ ఉన్నప్పుడే ఆటలో రాటుదేలుతారు. అంతర్జాతీస్థాయిలో రాణిస్తారు. సాత్విక్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అడపాదడపా రాష్ట్రస్థాయిలో పతకాలు సాధిస్తున్నా మొదట్లో స్పాన్సర్లు దొరకలేదు. అయినా నాణ్యమైన శిక్షణ లభిస్తుందనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున షట్లర్లను తయారు చేసే కార్ఖానాగా పేరున్న హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడెమీలో చేరాడు.

అప్పుడు టోర్నమెంట్లకు వెళ్లడానికి కూడా వేరొకరిపై ఆధారపడే పరిస్థితి. సన్నిహితులు, బంధువులు, ఊరివాళ్లు సాయం చేసేవారు. ఇవన్నీ చెబితే ఆటపై ప్రభావం పడుతుందని పేరెంట్స్‌ ఏమీ తెలియనిచ్చేవారు కాదు. పెద్ద టోర్నమెంట్లలో క్రమంగా విజయాలు సాధిస్తుండటంతో అకాడెమీలో తక్కువ ఫీజులు తీసుకోసాగారు. తర్వాత చిరాగ్‌తో డబుల్స్‌లో జట్టు కట్టాక అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గడంతో మంచి స్పాన్సర్లు దొరికారు. పరిస్థితి ఒక్కసారిగా మెరుగైంది. అప్పట్నుంటి వెనుదిరిగి చూడకుండా విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు.

ఇష్టాలు వదిలి...

ఆటలో ఒక్క ప్రతిభ ఉంటేనే సరిపోదు. ఎన్నో త్యాగాలు చేయాలి. నిరంతరం ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి. టోర్నమెంట్లు లేని రోజుల్లోనూ ఆట గాడి తప్పకుండా నిరంతరం సాధన చేయాలి. ఒలింపిక్స్‌కి ఎంపికయ్యాక రెండునెలలపాటు చిరాగ్‌తో కలిసి రోజుకి ఏడెనిమిది గంటలు కఠోర సాధన చేశాడు. వీళ్లకోసం గోపీచంద్‌ ప్రత్యేకంగా డెన్మార్క్‌కు చెందిన మథియాస్‌ బ్యూ అనే కోచ్‌ని నియమించారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచారాయన.

ఇదికాకుండా ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు అంచనా వేయడానికి గంటలకొద్దీ పాత మ్యాచ్‌ల వీడియోలు చూసేవాడు. సాత్విక్‌కి స్వీట్లు అంటే చాలా ఇష్టం. అయినా అవి తింటే చురుగ్గా కదలలేనని వాటి జోలికెళ్లడు. కచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తాడు. తక్కువ కేలరీలు ఉండేవే తీసుకుంటాడు. అమ్మ చేతివంటనే ఇష్టపడతాడు. తను గతంలో జపాన్‌ క్రీడల్లో పాల్గొనేందుకు 2017, 2018, 2019 సంవత్సరాల్లో అక్కడకు వెళ్లాడు. ఆ వాతావరణం కొత్తేమీ కాకపోవడంతో ఈసారి ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం నెగ్గి త్రివర్ణ పతాకం ఎగరేస్తానంటున్నాడు.

  • ఖాళీగా ఉంటే: వీడియోగేమ్స్‌ ఆడతా
  • ఇష్టపడే ప్లేయర్‌: హెండ్రా సెథియావాన్‌
  • ఆరాధించేది: రోజర్‌ ఫెదరర్‌
  • మర్చిపోలేని సందర్భం: అర్జున అవార్డుకి ఎంపికవడం
  • తొలిగురువు, స్ఫూర్తి: నాన్నే
  • బలం: బలమైన స్మాష్‌లతో విరుచుకుపడటం
  • ఇష్టపడే హీరో: ప్రభాస్‌
  • నచ్చే ఫుడ్‌: సౌతిండియన్‌
  • బ్యాడ్మింటన్‌ కాకుండా: క్రికెట్‌, చెస్‌ ఇష్టం.
  • యువతకో సలహా: క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత, మనపై మనకు నమ్మకం.. ఇవే టాప్‌లో నిల్చోబెడతాయి

విజయాల పరంపర..

  • 2013లో చంఢీగఢ్‌లో జరిగిన జాతీయ సాయిలో బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌తో కలిసి స్వర్ణపతకం
  • 2015లో ఇండోనేషియాలో జరిగిన అండర్‌-15 అంతర్జాతీయ టోర్నమెంట్‌లో మొదటి స్థానం
  • మారిషస్‌ అంతర్జాతీయ ఛాలెంజర్‌ టోర్నమెంట్‌లో గోల్డ్‌మెడల్‌
  • 2018 ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకం
  • 2019లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో స్వర్ణం
  • 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రజతం
  • 2020లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌లో మూడోస్థానం

ఇదీ చదవండి: ఒలింపిక్స్​ తొలి గోల్డ్​ మెడల్​ చైనాదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.