ETV Bharat / sports

గరిటె పట్టిన సింధు.. బిర్యానీ పసందు! - లాక్​డౌన్​లో పీవీ సింధు ఇంటర్వ్యూ

లాక్​డౌన్​ కారణంగా వచ్చిన విరామంలో కొత్త విషయాలను నేర్చుకున్నానంటోంది భారత షట్లర్ పూసర్ల వెంకట సింధు. బ్యాడ్మింటన్​​ రాకెట్​ పట్టాల్సిన చేత్తో వంటిట్లో గరిటె పట్టుకొని సాధన చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ట్రైనర్​ చెప్పిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తున్నాని 'ఈనాడు' ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించింది. సింధు చెప్పిన మరిన్ని విశేషాలు.. చదివేయండి.

Badminton Player PV Sindhu Special Interview
'మాస్క్​లు పెట్టుకొని ఆడలేం కదా..!'
author img

By

Published : May 16, 2020, 6:51 AM IST

పూసర్ల వెంకట సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో ఎవరెస్టంతటి క్రీడాకారిణి. ప్రపంచ ఛాంపియన్‌గా.. ఒలింపిక్స్‌ రజత పతక విజేతగా అత్యున్నత ఘనతల్ని అందుకున్న షట్లర్‌. అయితే ఇన్నాళ్లూ రాకెట్‌తో పతకాల్ని వేటాడిన ఆమె చేతులు ఇప్పుడు వంటింట్లో గరిటె తిప్పుతున్నాయి. తీరిక లేకుండా టోర్నీలాడిన సింధు.. అక్క కుమారుడితో ఆడుతూ సేదదీరుతోంది. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవన శైలిని పూర్తిగా మార్చేసిందంటున్న సింధుతో ప్రత్యేక ఇంటర్వ్యూ.

Badminton Player PV Sindhu Special Interview
అక్క కొడుకుతో సరదాగా గడుపుతున్న పీవీ సింధు

మళ్లీ మళ్లీ రాదు..

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నా. పదహారేళ్ల క్రితం బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టా. ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. ఊహించని విరామమిది. ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. రెండు నెలలు గడిచిపోయాయి. అయినా తప్పదు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి లాక్‌డౌన్‌ మినహా మరో మార్గం లేదు. అన్నిటికంటే జీవితం ముఖ్యం. ప్రస్తుత పరిస్థితి నిరాశ కలిగిస్తుండొచ్చు. కానీ అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని సానుకూలంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో గడపొచ్చు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ ఎప్పుడూ ఇంత సమయం దొరక్కపోవచ్చు.

నా డైరీలో ఒక రోజు

లాక్‌డౌన్‌లో పూర్తిగా ఇంటికి పరిమితమయ్యా. ట్రైనర్‌తో మాట్లాడుతూ కసరత్తులు చేస్తున్నా. స్నేహితులతో పెద్దగా మాట్లాడింది లేదు. ఉదయాన్నే లేవడం.. అకాడమీకి వెళ్లడం చిన్నప్పట్నుంచి అలవాటు. ఇప్పుడు ఆలస్యంగా నిద్ర లేస్తున్నా. ఉదయం 9.30 లేదా 10 గంటలకు మంచం దిగుతున్నా. అల్పాహారం తర్వాత కాసేపు సాధన చేస్తా. కొద్దిసేపు పడుకుంటా. మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్లీ పడుకుంటా. సాయంత్రం కొద్దిసేపు సాధన సాగిస్తా. అనంతరం అమ్మతో కలిసి వంటింట్లో బిజీ. వంట చేయడమంటే నాకు చాలా ఇష్టం. లాక్‌డౌన్‌ సమయంలో ఘుమఘుమలాడే బిర్యానీ చేయడం నేర్చుకున్నా. కేక్‌, కుకీస్‌, ఉల్లి పకోడి చేస్తున్నా. బొమ్మలు గీస్తున్నా. తీరిక సమయంలో అక్క కుమారుడితో కలిసి ఆడుకుంటా. సినిమాలూ చూస్తున్నా. ఇన్ని రోజుల విరామం నాకెప్పుడూ దొరకలేదు. ప్రతి క్షణాన్నీ కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నా.

వంట చేస్తున్న పీవీ సింధు

మాస్కులతో ఆడలేం

ఇప్పట్లో టోర్నీల నిర్వహణ కష్టమే అనిపిస్తోంది. ఏ దేశానికి వెళ్లినా కరోనా రాదన్న గ్యారంటీ లేదు. ఎక్కడో ఓ చోట కూర్చుంటాం.. నిల్చుంటాం. ఏదో ఒక వస్తువుని తాకుతాం. అన్నీ మన నియంత్రణలో ఉండవు. ఒక దేశంలో ఎక్కువ టోర్నీలు నిర్వహించినా.. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరిపించినా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం. టోర్నీలు ప్రారంభమైతే శుభ్రత, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. కరచాలనాలు మానెయ్యాలి. మ్యాచ్‌ అవగానే కోర్టును శానిటైజర్లతో శుభ్రం చేయాలి.

రెండు వారాల్లో సిద్ధం

క్రీడాకారులకు ఎప్పుడూ ఖాళీ ఉండదు. అస్సలు సమయం దొరకదు. లాక్‌డౌన్‌ వల్ల నిర్బంధ విరామం లభించింది. అయితే రోజూ కసరత్తులు చేయడం మానట్లేదు. ట్రైనర్‌ సూచించినట్లుగా ఉదయం, సాయంత్రం వ్యాయామాలు తప్పనిసరి. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ మాత్రమే లేదు. ఆట ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ ఎప్పుడు ఆరంభమైనా ఒకట్రెండు వారాల్లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించగలను. నైపుణ్యం, స్ట్రోక్స్‌ మీద దృష్టిసారిస్తే సరిపోతుంది. అందరూ అలా సిద్ధం కాలేకపోవచ్చు. మంచి ఫిట్‌నెస్‌ ఉన్నవాళ్లు ఇంకాస్త తొందరగానే సిద్ధమవుతారు. కసరత్తులు చేయని వాళ్లకు ఎక్కువ సమయం పడుతుంది.

తెలివిగా కష్టపడాలి

"అందరం మంచి ఫామ్‌లో ఉన్నాం.. సరైన సమయంలో ఒలింపిక్స్‌ వచ్చాయి. సత్తా చాటేందుకు సరైన సమయం" అని అనుకుంటున్న సమయంలో కరోనా వచ్చింది. ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితి మనదే కాదు అందరిదీ. ఎవరూ కోరుకున్నదీ కాదు. ఒలింపిక్స్‌ వాయిదా పడ్డాయి.. ఒక ఏడాది వయసు ఎక్కువవుతుందని బాధపడుతూ కూర్చుంటే వృథా. వయసు పెరిగినంత మాత్రాన నైపుణ్యం ఎక్కడికీ పోదు. ఎవరూ లాక్కోలేరు. లాక్‌డౌన్‌ అయిపోగానే తెలివిగా కష్టపడాలి. మనుపటి జోరు అందుకోవాలి.

ఇదీ చూడండి.. రాహుల్​తో పోటీనా? అదేం లేదు: ధావన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.