ETV Bharat / sitara

కొన్ని గంటల్లో 'ఫ్యామిలీమ్యాన్​ 2' ఉత్కంఠకు తెర! - ఫ్యామిలీమ్యాన్​ 2 వివాదం

'ది ఫ్యామిలీమ్యాన్​' వెబ్​సిరీస్​ రిలీజ్​కు రంగం సిద్ధమైంది. రాజ్​&డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్​ అమెజాన్​ ప్రైమ్​ ద్వారా శుక్రవారం (జూన్​ 4) ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సారి తమిళుల ఆందోళన నడుమ వెబ్​సిరీస్​ విడుదలకానున్న నేపథ్యంలో ఏ విధంగా అలరిస్తుందోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

The Family Man 2 is ready to release on Amazon Prime
కొన్ని గంటల్లో 'ఫ్యామిలీమ్యాన్​ 2' ఉత్కంఠకు తెర!
author img

By

Published : Jun 3, 2021, 5:12 PM IST

ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ది ఫ్యామిలీమ్యాన్​ 2' వెబ్​సిరీస్​ విడుదలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం(జూన్​ 4) అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సిరీస్​ రిలీజ్​కు ముందే కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. తమిళులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్రైలర్​లో​ సన్నివేశాలు తమిళనాడులో ఇటీవలే కొన్ని ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యం వెబ్​సిరీస్​ రిలీజ్​ను ఆపేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహ పలువురు కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

అయితే ఈ సిరీస్​లోని పాత్రలు కానీ, కథ ద్వారా ఎవర్ని కించపరచబోమని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఓ సారి వెబ్​సిరీస్​ చూసిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలంటూ ఆందోళకారులను కోరారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య రిలీజ్​ అవుతోన్న ఈ సిరీస్​ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించగలదో? అనే ఉత్కంఠ మొదలైంది. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధానపాత్రలు పోషించిన ఈ సిరీస్‌ మొదటి భాగం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ నటన విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌ అందించిన విజయోత్సాహంతో 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్‌ 2ను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్‌, డీకే. రెండో సీజన్​లో అదనపు ఆకర్షణగా కథానాయిక సమంత నటించారు.

ఇదీ చూడండి: The Family Man: అలరించిన పాత్రలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.