మైనర్‌ను రేప్ చేశాడనే ఆరోపణలతో ప్రముఖ టీవీ నటుడు పెర్ల్ వి పూరీని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పోస్కో చట్టం కింద అతడితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. టీవీ సీరియల్స్‌లో అవకాశాలు ఇస్తానని మాయమాటలు చెప్పి, తన శారీరక అవసరాలు తీర్చుకున్నాడని ఓ మైనర్.. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ విషయం నిజం కాకపోవచ్చని పెర్ల్కు అండగా నిలిచింది అతడి సహనటి అనితా హసనందిని. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగార్జున ఏక్ యోధ, నజర్ సే కూబ్సూరత్, బేపనా ప్యార్, ఫిర్ బీ నా మానే.. బత్తీమీజ్ దిల్ తదితర సీరియళ్లలో నటించి, గుర్తింపు తెచ్చుకున్నాడు పెర్లి వి పూరీ.
![Television actor Pearl Puri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-mh-mhc10078-vasai_05062021122630_0506f_1622876190_859.jpg)
ఇవీ చదవండి: