హిందీ బుల్లితెర నటుడు అశీష్ రాయ్(55) మంగళవారం కన్నుమూశారు. మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇంతకు ముందే ఈ సమస్య ఉన్నప్పటికీ, లాక్డౌన్లోనే ఇది తీవ్రంగా బాధించిందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆశీష్ మృతి వార్తను ముంబయి సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీనియర్ జాయింట్ సెక్రటరీ అమిత్ బెహ్ల్ ధ్రువీకరించారు.
బుల్లితెరలో 'మూవర్స్ & షేకర్స్', 'యస్ బాస్', 'రీమిక్స్', 'బా బహూ ఔర్ బేబీ', 'చల్ది డా నామ్ గడ్డి', 'బ్యూరీ భీ హమ్ భలే భీ హమ్', 'సాసురల్ సిమార్ కా', 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ', 'మేరే ఆంగ్నే మెయిన్', 'ఆరంభ్' ధారావాహికలు, కార్యక్రమాల ద్వారా ఆశీష్ రాయ్ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదీ చూడండి... కిడ్నీ సమస్యతో టీవీ నటి మృతి