సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లు తనకు కిక్ ఇస్తాయని అంటున్నారు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్(Bandla Ganesh). మాట్లాడాలని మైక్ పట్టుకున్న తర్వాత తనలో పూనకం వస్తుందని చెప్పారు. అలా సినిమాపై, హీరోపై ఉన్న ప్రేమను ఆ విధంగా బయటపెడతానని ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమానికి గతంలో హాజరైనప్పుడు వెల్లడించారు. సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఎదిగిన క్రమంలో హీరో పవన్‌కల్యాణ్(Pawan Kalyan), దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh)కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.
అందుకే విరామం..
నిర్మాతగా సక్సెస్ అవుతున్న సమయంలోనే సినిమా నిర్మాణానికి వెనకడుగు వేసినట్లు నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. అప్పటివరకు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్న క్రమంలో డబ్బు పోతుందేమోనన్న భయంతో కొన్నాళ్ల బ్రేక్ తీసుకున్నట్లు తెలిపారు. కానీ, ఓ పెద్ద చిత్రంతోనే మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇస్తానని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవితో కచ్చితంగా సినిమా చేసి తీరుతానని గణేశ్ స్పష్టం చేశారు. అయితే పవన్‌కల్యాణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాతగా మళ్లీ రీఎంట్రీ(Bandla Ganesh Reentry) ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బండ్ల గణేశ్ ట్విట్టర్లో స్పష్టం చేశారు. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు.
కాజల్ అంటే అభిమానం..
నిర్మాతగా ఎంతోమంది హీరోయిన్లతో పనిచేసిన బండ్ల గణేశ్.. వ్యక్తిగతంగా తాను కాజల్ అగర్వాల్(Kajal)కు అభిమానని చెప్పారు. కాజల్‌తో పాటు కమల్‌హాసన్ కుమార్తె శ్రుతిహాసన్(Shruti Haasan)పై కూడా ఎంతో గౌరవం ఉందని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. 'అగ్ర హీరోలు అందుకే నాతో సినిమాకు ఓకే చెప్తారు'