ETV Bharat / sitara

రాజమౌళి, కొరటాల శివకు ఎన్టీఆర్​ వార్నింగ్‌! - ఎవరు మీలో కోటీశ్వరుడు రాజమౌళి

హీరో ఎన్టీఆర్​.. దర్శకులు రాజమౌళి, కొరటాల శివకు వార్నింగ్​ ఇచ్చారు! తానే బాస్​ అని అన్నారు. ఇంతకీ తారక్​.. వారిని ఎందుకు హెచ్చరించారంటే?

ntr
ఎన్టీఆర్​
author img

By

Published : Sep 17, 2021, 6:31 PM IST

ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తుంటూనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ! 'రోల్‌ కెమెరా' అని కొరటాల శివ, 'యాక్షన్‌' అని రాజమౌళి చెప్పగానే ఎన్టీఆర్‌ రంగంలోకి దిగితే ఆ మజానే వేరు. పండగలాంటి ఈ వాతావరణాన్నే తీసుకొస్తుంది 'ఎవరు మీలో కోటీశ్వరుడు'(Evaru Meelo Koteeswarulu) కార్యక్రమం. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ఈ షో ప్రసారమవుతోంది. తన వాక్పటిమతో కంటెస్టెంట్లను, ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న ఎన్టీఆర్‌(meelo evaru koteeswarudu junior ntr).. మరింత వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకులు రాజమౌళి, కొరటాల శివని ఈ కార్యక్రమానికు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. సెప్టెంబరు 20న ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆద్యంతం అలరిస్తోంది.

'రోల్‌ కెమెరా' అని కొరటాల.. 'యాక్షన్‌' అని జక్కన్న తమ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, సందడి చేశారు. ఓ ప్రశ్నకు సమాధానం కోసం రాజమౌళి, శివ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. 'ఎంతసేపూ మీలో మీరు మాట్లాడుకుంటే మాకేం వినిపిస్తుంది. ఇలా చేసినందుకు వీరికి ఆప్షన్లు ఇవ్వకుండా ఈ ప్రశ్నను తీసేయొచ్చా గురువు (కంప్యూటర్‌) గారు' అని ఎన్టీఆర్‌ అనగానే 'తప్పండి.. అలా చేయకూడదు' అంటూ దర్శకులు విన్నవిస్తారు. 'మరి మరొక్కసారి' అంటూ సరదాగా (నవ్వుతూ) వారికి ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇస్తారు. వెంటనే 'ఇక్కడ లొకేషన్‌ నాది, డైరెక్షన్‌ నాది.. నేనే బాస్‌ ఇక్కడ' అని చెప్పి ఫిదా చేస్తున్నారు. మరి మీకూ ఈ హంగామా చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం చూసి ఆనందించండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Ntr Koratala Movie: చరణ్​ భామ.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.