ETV Bharat / sitara

'ఇది బస్తీ కాదు... లోబోకు వార్నింగ్​ ఇచ్చిన నాగార్జున!​' - బిగ్ బాస్ 5 తెలుగు

బిగ్​బాస్​లో (Bigg Boss 5 Telugu) వీకెండ్​ ఎపిసోడ్​కు ఉన్నంత క్రేజ్​ అంతా ఇంతా కాదు. హౌస్​మేట్స్​కు క్లాస్​ పీకాలన్నా.. మురిపాల ముచ్చట్లు చెప్పాలి అన్నా.. అది వీకెండ్​లోనే. అయితే ఈ వారాంతంలో మాత్రం హౌస్​మేట్స్​కు చుక్కలు చూపించేందుకు హోస్ట్​ నాగార్జున సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వారంలో హౌస్​లో లోబో మాట్లాడిన మాటలపై నాగ్​ ఫైర్​ అయినట్లు తెలుస్తోంది.

nagarjuna fires on lobo
లోబో
author img

By

Published : Oct 2, 2021, 8:03 PM IST

వీకెండ్‌లో వినోదాన్ని పంచడంతో పాటు, హౌస్‌మేట్స్‌ తప్పులను ఉతికి ఆరేయడానికి సిద్ధమయ్యారు అగ్ర కథానాయకుడు నాగార్జున. ఆయన వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ రియాల్టీషో 'బిగ్‌బాస్‌: సీజన్‌-5' (Bigg Boss 5 Telugu). ఈ వారం నామినేషన్స్‌ మొదలుకొని, శుక్రవారం వరకు జరిగిన సంఘటలపై నాగార్జున స్పందించారు.

ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు కాస్త గట్టిగానే క్లాస్‌ పీకారు. 'షణ్ముఖ్‌ కూర్చొని కబుర్లు చెబుతున్నావేం', 'అమ్మా సిరి.. నీ ఆట నువ్వు ఆడమ్మా' అంటూ ఇద్దరికీ గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఇక నామినేషన్స్‌ సందర్భంగా లోబో ప్రవర్తనను ఖండించారు. 'నా వరకూ నేను బరాబర్‌ చేసిన.. జనాలకు ఏం నచ్చుతుందో, నచ్చటం లేదో నాకు తెలియదు సర్‌' అని లోబో అనగా, 'అరవటం కూడా బరాబర్‌ అంటావా' అనగా 'లవ్‌ పదం ఎత్తగానే నాకు కోపం వచ్చింది' అని లోబో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 'నీ ఒక్కడికే ఉందా ప్రేమ మిగతా వాళ్లకు లేదా? అరిచేసి, గొంతు చించుకుని..' అంటూ లోబో మాట్లాడిన వీడియోను (Bigg Boss Telugu Latest Promo) చూపించేసరికి, అతడు సారీ చెప్పాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక గత వారం జరిగిన ఆసక్తికర విశేషాలతో నాగార్జున హౌస్‌మేట్స్‌ను అలరించారు (Bigg Boss Telugu Latest News). రవిని నటరాజ్‌ మాస్టర్‌ నత్త అనడం, ఊసరవెల్లి అని ఎవరిని అన్నారో అడగటం చేశారు. సందడిగా సాగుతున్న క్రమంలో 'మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌' అంటూ రవికి జెస్సీ ట్యాగ్‌తో పాటు, వార్నింగ్‌ కూడా ఇచ్చాడు.

ఇదీ చూడండి: సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.