ETV Bharat / sitara

సినిమా నాశనమైందని ఆ దర్శకుడు నాపై అరిచాడు: నాగినీడు - ali tho saradaga promo

'మర్యాద రామన్న' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగినీడు.. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన వల్ల సినిమా మొత్తం నాశనమైందని ఓ దర్శకుడు అరిచిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 'మర్యాదరామన్న' చిత్రం తనకు ప్లస్, మైనస్​ అని అన్నారు.

naagi needu in ali tho saradaga
నాగినీడు
author img

By

Published : Nov 17, 2021, 11:16 AM IST

ఆయన.. 'మర్యాద రామన్న'ను ముప్పుతిప్పలు పెట్టి పరుగులు తీయించిన మహా విలన్‌. తండ్రిగా, అన్నగా, అధికారిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన సహజ నటుడు నాగినీడు. ఒకవైపు తెర వెనుక పనుల్లో బిజీగా ఉంటూనే తెరపై సహజత్వం ఉట్టిపడే నటనతో దక్షిణాది భాషల్లో ప్రాధాన్యమున్న ఎన్నో పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఆయన.. అలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

నాగినీడు మీ ముందు ఏంటి? వెనుక ఏంటి?

నాగినీడు: నాగినీడు అనే పేరు చాలా ప్రత్యేకం. ఇంతవరకూ ఆ పేరు ఎవరికీ లేదు. ఇప్పుడు పెట్టుకున్నారేమో తెలియదు. నాగినీడు అనే పేరు మా ఊరి పెద్దకు ఉండేది. 1765 కాలంలో నేను మచిలీపట్నం వెళ్లి ఓ ఇష్టాగోష్టిలో పాల్గొని తిరిగి కలువపాముల గ్రామానికి వస్తుంటే ఇద్దరు నన్ను ఆపారు. 'మీరు అక్కడ మాట్లాడింది మాకు నచ్చింది. (అలీ కలుగజేసుకొని 1765 ఆ? 1966 ఆ అని ప్రశ్నించగా.. 1765 లేదా 1745 కాలంలో అని నాగినీడు చెప్పారు) ఈ గ్రామం శిథిలమైపోయింది. మీరు పునరుద్ధరించాలన్నారు. దీంతో అక్కడ స్థిరపడ్డా. వెళ్లిపోయా(మరణించడం అనే ఉద్దేశంతో). మళ్లీ వచ్చి పోయా.. మళ్లీ ఇప్పుడు వచ్చా.. నాకు చాలా పెద్ద చరిత్ర ఉంది.(నవ్వులు)

naagi needu in ali tho saradaga
ఆలీతో సరదాగా షోలో నాగినీడు

అలాంటివి నమ్ముతారా?

నాగినీడు: నమ్ముతా.. 100శాతం

అంటే మీ పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వారేనా?

నాగినీడు: అవును. అసలు వెల్లంకి అనే ఇంటి పేరంటే కలువపాముల గ్రామం. నిజానికి ఒంగోలు చుట్టుపక్కల నుంచి అక్కడికి వెళ్లి స్థిరపడ్డాం.

మీ తండ్రి ఏం చేస్తారు?

నాగినీడు: రైతు. కాంగ్రెస్‌ పార్టీలో క్రియశీలకంగా పనిచేశారు. కాకాని వెంకటరత్నం గారికి తోడుంటూ 12 ఎకరాలు కరిగించేశారు.

మీ తోబుట్టువులు ఎంతమంది?

నాగినీడు: ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. నేను మూడోవాడిని. ఇక నా జీవితం ప్రసాద్‌ ల్యాబ్‌కు అంకితమైపోయింది. అందులో నేను చేరాక.. నా వద్దకు అందరూ రావడమే కానీ, నేను ఎక్కడికీ వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఫిల్మ్‌ మా దగ్గరే ఉండేది. దీంతో నాకు స్నేహితులు ఉండేవారు కాదు. బంధువులతో సంబంధాలు ఉండేవి కావు.

ప్రసాద్‌ ల్యాబ్‌లో ఎన్నేళ్లు పనిచేశారు?

నాగినీడు: నా వయసు 30 దాన్ని బట్టి మీరే లెక్కేసుకోండి.

ఇప్పుడు 30 ఆ? 30 ఏళ్ల కిందట 30ఆ?

నాగినీడు: ఇప్పుడు నా వయసు 30. కావాలంటే.. 30ఏళ్ల వ్యక్తులతో పందెం పెట్టండి.

జిమ్‌ చేస్తారా?

నాగినీడు: జిమ్‌ అనేది అసహజమైనది. జిమ్‌కు వెళ్తే బాడీ మెయింటెన్‌ చేయొచ్చని చాలా మంది పొరపడుతుంటారు. అది కేవలం కండలు పెంచుతుందే గానీ.. ఆరోగ్యానివ్వదు. ఆరోగ్యాన్ని ఇచ్చేది యోగా.. నడక. లేదంటే ఇంట్లో పనులు చేసినా చాలు.

మీకు ఎంత మంది పిల్లలు?

నాగినీడు: ఇద్దరు మగ పిల్లలు. పెద్దోడు అమెరికాలో ఉన్నాడు. చిన్నోడు అమెరికాలో ఉండటం ఇష్టంలేక ఇక్కడికి వచ్చి చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. నాకు ఇద్దరు మనవరాళ్లు.

భగవంతుడిని నమ్ముతారా?

నాగినీడు: నమ్ముతాను. నిజమైన పుణ్యక్షేత్రాలకు స్థల ప్రభావం ఉంటుంది. అక్కడికెళ్లి సంకల్పంతో ఏదైనా అనుకుంటే అది సాధిస్తాం. మనం ప్రిలోడెడ్‌ సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన రోబోలం. దేవుడు ముందే మనకు సాఫ్ట్‌వేర్‌ లోడ్‌ చేసేశాడు. అది మార్చలేం. కానీ, మన సంకల్ప బలంతో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అందుకోసం ప్రశాంతమైన స్థలం అవసరం.

ఎప్పుడైనా అనుకున్నారా.. స్క్రీన్‌పై మీద కనిపిస్తారని..?

నాగినీడు: నిజానికి, నా చిన్నప్పుడే పూలరంగడు(అక్కినేని నాగేశ్వరరావు నటించిన) సినిమాతో నాకు ఆశ మొదలైంది. గుంతకల్లులో ఎల్వీ ప్రసాద్‌ గారు థియేటర్‌ కడుతుండటం వల్ల ఆయన సతీమణి సూచన మేరకు మా తండ్రిని గుంతకల్లు పంపించారు. నేను చదువుకుంది.. పెరిగింది అంతా అక్కడే. ఆ థియేటర్‌లో విడుదలైన మొదటి సినిమా పూలరంగడు. అది చూడగానే నాకు నటుడవ్వాలనే కోరిక కలిగింది. అందరి సినిమాలు చూసేవాణ్ని. ఇంట్లో రాజబాబు గారిలా నటించేవాణ్ని. ఇప్పుడు ఈ అవతారంతో రాజబాబులా నటిస్తే ఎవరూ నవ్వరు.

చెన్నైలో కెమికల్‌ టెక్నాలజీలో చదువుకున్నా. అదే సమయంలో ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబ్‌ ప్రారంభించారు. అందులో నన్ను చేరమని ఎల్వీప్రసాద్‌ సతీమణి చెప్పారు. నేనేమో దుబాయ్‌కు వెళ్దామనుకున్నా. అయితే, ఇక్కడ సినిమా అవకాశాలు వచ్చేలా ఉన్నాయని ఇందులో చేరా. కానీ, ఎవరినీ ఏదీ అడగలేదు. వస్తే స్వీకరిద్దాం.. లేదంటే లేదు అనుకున్నా. ఆ తర్వాత బాధ్యతలు పెరిగాయి. చెన్నై, హైదరాబాద్‌, భువనేశ్వర్‌, ముంబై, త్రివేండ్రం, నొయిడా ప్రాంతాల్లో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలు ఉండేసరికి.. నటుడు అవ్వాలన్న ఆశ ఉన్నా ఎవరినీ అడగలేదు. దర్శకుడు రాఘవేంద్రరావు ఓ సినిమా తీస్తున్న సమయంలో నేను, ఆయన ఓ లాన్‌లో కూర్చొని వేరుశెనగకాయలు తిన్నాం. అయినా ఎవరినీ అడగలేదు.

ఫిల్మ్‌లు పోతున్నాయ్‌ కదా.. నీ పరిస్థితి ఏంటని కళామ్మతల్లి ఆశీర్వదిస్తే.. నటుడినయ్యా. మీరేందుకు నటించకూడదని బెల్లంకొండ సురేశ్‌ నన్ను అడిగారు. మీరు అవకాశం ఇస్తే చేస్తానన్నా. అదే చెన్నకేశవరెడ్డి. అది నా తొలి సినిమా. తంగర్‌ బచ్చన్‌ అనే దర్శకుడు నన్ను చూసి 'పల్లికూడెం' అనే చిత్రంలో అవకాశమిచ్చారు. స్నేహకు చిన్నాన్న క్యారెక్టర్‌ చేయాలన్నారు. అది ఫుల్‌ లెన్త్‌ క్యారెక్టర్‌. ఆ క్లిప్పింగ్స్‌ను ఎడిటర్‌ ఇంఛార్జ్‌ తమ్మిరాజు చూసి.. వాటిని రాజమౌళి గారికి చూపించారు. ఆయన స్పందించి.. నాకు మంచి క్యారెక్టర్‌ ఇస్తానని చెప్పమన్నాడట. అదే మర్యాద రామన్న.

మర్యాద రామన్న ఎంత బ్రేక్‌ ఇచ్చింది మీకు?

నాగినీడు: ఒక విధంగా చెప్పాలంటే ఒక ఎత్తులో కూర్చోబెట్టింది. కానీ, అదే మైనస్‌ అయింది. పెద్ద పెద్ద డైరెక్టర్లను అడిగితే.. 'నాగినీడు గారు.. మీకేదైనా పాత్ర ఇస్తే అది మీరే చేయగలరన్న పాత్రే ఇస్తాం గానీ, అలాంటి క్యారెక్టర్‌ మా దాంట్లో లేవు. మిమ్మల్ని మాములు క్యారెక్టర్‌లో నిలబెట్టలేం కదా' అంటున్నారు. నేనైతే ఏదైనా కామెడీ క్యారెక్టర్‌ వస్తే చేద్దామని ఆశపడుతున్నాను. ఇంతవరకు ఆ అవకాశం రాలేదు.

maryada ramanna movie naagineedu
మర్యాదరామన్న సినిమాలో నాగినీడు

మీరు ప్రసాద్‌ ల్యాబ్‌లో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు బయటకు వెళ్లాయి?

నాగినీడు: నేను లెక్కపెట్టలేదు కానీ.. కొన్ని వందల సినిమాలు వెళ్లాయి.

అక్కడ లెక్కపెట్టలేదు.. ఇక్కడ లెక్కపెట్టలేదు ఎందుకలా?

నాగినీడు: నేను నిన్నటి గురించి ఆలోచించను. ఎంత మందికి మంచి చేశానన్న విషయం కూడా గుర్తుపెట్టుకోను. ఎవరికన్నా చెడు చేసుంటే మాత్రం గుర్తుపెట్టుకుంటా. కాబట్టి మంచి జరిగిందేదైనా మర్చిపోతా. ఎందుకంటే దాని మీద బతకకూడదు. తర్వాత నిరాశపడతాం.

సినిమా విడుదల సమయంలో నిర్మాతలకు సమస్యలు రావడం సహజం. మీరు కొంతమందిని అలాంటి సమస్యల నుంచి బయటపడేశారట?

నాగినీడు: ఓ స్టార్‌ నిర్మాతకు చెందిన సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి.. సినిమా విడుదల చేయించా. ఉదయం నిర్మాత నాకు నమస్కారం పెట్టి దేవుడిలా కాపాడారన్నారు. 'నేనేమీ సహాయం చేయలేదు. మా సంస్థను కాపాడుకోవడం చేసిన ప్రక్రియలో మీకు మంచి జరిగింది. కాబట్టి నేనేదో సాయం చేశానని గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్‌ కాదు' అని అన్నాను.

రాజమౌళి గారు.. మర్యాద రామన్న సినిమాలో మీకు ఆ క్యారెక్టర్‌ ఇవ్వగానే.. చాలా మంది వద్దు అని ఆయనకు చెప్పారట. అది విన్నప్పుడు, సినిమా చూసినప్పుడు మీకు ఏం అనిపించింది?

నాగినీడు: నన్ను ఎంపిక చేసిన తర్వాత ఎవరైనా సలహా ఇచ్చారేమో నాకు తెలియదు. దాని గురించి నాకు ఆయన అప్పుడే చెప్పేశారు.. 'ఆ పాత్రకు చాలా మంది నటుల పేర్లు చెప్పారు. కానీ.. నేను మిమ్మల్నే ఫిక్స్‌ అయ్యాను. మీరు గడ్డం, మీసం పెంచేయండి' అన్నారు. ఆ సినిమా విడుదలై.. చూసిన తర్వాత అనిపించిందేంటంటే.. ఆ సినిమా సక్సెస్‌కు ఒకే ఒక్క వ్యక్తి కారణం. ప్రేక్షకుల దృష్టిలో అది నేను. నా దృష్టిలో దర్శకుడు రాజమౌళి. అప్పటి వరకు ఆయన గ్రాఫిక్స్‌, పెద్ద పెద్ద సినిమాలు చేసిన దర్శకుడు.. ఈ సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో చూపించిన విధానంతోనే హిట్‌ అయింది. నా అదృష్టంకొద్దీ ఆ అవకాశం నాకు వచ్చింది. ఆయన ఒక రాయితో కూడా నటింపజేయగలరు. అంత ప్రతిభ ఉన్న దర్శకుడు.

ఫ్యాక్షన్‌ క్యారెక్టర్‌ అంటే ఒకప్పుడు జయప్రకాశ్‌రెడ్డి గారు.. మర్యాద రామన్నలో మిమ్మల్ని చూసిన తర్వాత ఎప్పుడైన ఎదురుపడి భలే చేశారని మెచ్చుకున్నారా?

నాగినీడు: ఎవరైనా వచ్చి 'బాగా చేశావ్‌' అని చెబితే అది నా మైండ్‌కు ఎక్కదు. విమర్శిస్తే.. దానిని సరిచేసుకుంటా కదా అని మైండ్‌లో అనుకుంటా. ఒక విషయం చెబుతా.. ఎవరినైనా పొగడాలంటే వెనకాల పొగుడు. ఒక వ్యక్తిని తిట్టాలంటే ఎదురుగా తిట్టు. అలాంటి వాళ్లే మన శ్రేయోభిలాషులు.

మీ నటన చూసి.. ఓ దర్శకుడు మీ వల్ల నా సినిమా మొత్తం నాశనమైపోయింది అని అరిచారట. ఎవరాయన?

నాగినీడు: తంగర్‌ బచ్చన్‌. ఫస్ట్‌ డే షూటింగ్‌. ఒకటిన్నర పేజీ డైలాగ్‌ సింగిల్‌ షాట్‌లో తీయాలి. నేను మొదలుపెట్టాక ఆయన కట్‌ అన్నారు. "పోయింది. నా జీవితమే నాశనమైపోయింది. ఈ సీన్‌ను నమ్ముకునే సినిమా తీస్తున్నా సర్‌. నేను చెప్పింది ఏంటి? మీరు ఏం చేస్తున్నారు?" అని ఇష్టం వచ్చినట్లు అరిచేశారు. అసోసియేట్‌ డైరెక్టర్‌ నా వద్దకు రాగానే "నేను సినిమా చేయట్లేదు. తొలి రోజు షూటే కదా.. వేరే వాళ్లను పెట్టుకోండి. ఒక ఆర్టిస్ట్‌ మీద అరిస్తే.. అతడి మూడ్‌ పోతే మళ్లీ టేక్స్‌ పెరుగుతాయ్‌. ఆయన నా స్నేహితుడు ఆయన్ను నష్టపర్చదల్చుకోలేదు. వెళ్లి చెప్పండి" అన్నాను. దర్శకుడు వచ్చి ఇస్త్రీ చేసే దగ్గర నుంచి మొదలుపెట్టండి అన్నారు. ఆ సీన్‌ షూట్‌ చేశాం. అది చూసి దర్శకుడు "ఒకటిన్నర పేజీ డైలాగ్స్‌ సింగిల్‌ షాట్‌లో చెప్పారు. రజినీకాంత్‌ కూడా చేయలేరు సర్‌" అని అన్నారు. ఆ తర్వాత నన్ను ఎవరూ తిట్టలేదు.

మర్యాద రామన్న తర్వాత మీకు మంచి పేరు తెచ్చిన సినిమాలేవి?

నాగినీడు: వరుసగా సినిమాలు పడ్డాయి. మిర్చిలో ఒక అమ్మాయిని కాలేజీలో చేర్చే సీన్‌లో నా నటనను చూసి ప్రభాస్‌ మెచ్చుకున్నారు. ఆ సీన్లలో ఎక్స్‌ప్రెషన్స్‌కు నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ఆ ఘనత దర్శకుడిదే. తర్వాత సినిమా.. గబ్బర్‌ సింగ్‌లో నటనను చూసి పవన్‌ కల్యాణ్‌ గారు కూడా మంచి భావోద్వేగాలు పలికించానని మెచ్చుకున్నారు. ఒక నటుడి సక్సెస్‌ పక్కనుండే మరో నటుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది.

మీది ప్రేమ వివాహామా? పెద్దలు కుదిర్చిందా?

నాగినీడు: ఎనిమిదో తరగతిలో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా. చెబుదామనుకున్నా చెప్పలేదు. మళ్లీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ అయిన తర్వాత ఓ అమ్మాయిని ఇష్టపడ్డా. కానీ, ప్రయత్నించలేదు. డిగ్రీలోనూ ఓ అమ్మాయిని ఇష్టపడ్డా. అప్పుడూ ప్రయత్నించలేదు. వృత్తిలోకి వచ్చాక ఎవరైనా పెళ్లి చేసుకుందామని చూస్తూ.. సర్లే ఎనిమిదో తరగతిలో ఇష్టపడ్డ అమ్మాయిని చూద్దామని వెళితే.. ఆమె ఐఏఎస్‌ ఆఫీసరైంది. ఇంటర్‌లో చూసిన అమ్మాయిని చూస్తే ఒకరింట్లో పనిమనిషి అయింది. డిగ్రీలో చూసిన అమ్మాయికి పెళ్లైపోయింది. మా తాత గారు సంబంధం తీసుకురావడం వల్ల అమ్మాయిని చూడకుండానే వివాహం చేసుకున్నా. ఎనిమిదో తరగతిలో ఇష్టపడ్డ అమ్మాయి పేరు.. నా భార్య పేరు ఒకటే.. నాగమణి. యువతకు, విద్యార్థులకు ఏదైనా చెప్పాల్సి వస్తే.. ప్రేమ కంటే కెరీర్‌ ముఖ్యమంటూ ఇదే విషయాన్ని చెబుతుంటా.

ఆలీ: నేను ఒకసారి ప్రసాద్‌ ల్యాబ్‌లో డబ్బింగ్‌ చెప్పి వెళ్తుంటే.. అలీ గారు అని మీరు పిలిచారు. 'మా ల్యాబ్‌లో కొన్ని సినిమాలు సులువుగా విడుదలవుతాయి. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్‌ విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఏ గొడవలు జరగకుండా ప్రశాంతంగా బయటకు వెళ్లిపోయే సినిమా.. మీ సినిమానే' అని చెప్పి మీరు వెళ్లిపోయారు. అది విని చాలా సంతోషపడ్డా.

మీరు ప్రసాద్‌ ల్యాబ్‌లో చాలాకాలం పనిచేశారు కదా.. మీరు ప్రివ్యూ షో చూస్తున్నప్పుడు సినిమా ఫలితం అప్పుడే డిసైడ్‌ చేసేవారా?

నాగినీడు: అన్ని సినిమాల గురించి ముందే తెలుసు నాకు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి. అయితే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఫోన్లు చేసి 'మీరు సినిమా చూసి ఉంటారు కదా.. ఎలా ఉంది?' అని అడుగుతుంటారు. నేను రాత్రి 12 తర్వాత ఫోన్‌ చేయమని చెప్పేవాడిని. అదేంటి సర్‌ అనేవారు.. అప్పుడు ప్రింట్లు అన్నీ వెళ్లిపోయి ఉంటాయి కదా..! అప్పుడు చేప్పేస్తా అనే వాడిని. దిల్‌ రాజు గారు కూడా అడిగితే.. నేను అలాగే చెప్పా. 'శంకరాభరణం' ఆడదనుకొని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నిరాశలో ఉన్నారు. అలాంటి పరిస్థితిల్లో ఫస్ట్‌ కాపీ వచ్చాక నేను ఆయనతో "ఎవరు చెప్పారు సర్‌ మీకు? దీంట్లో ఒక పాట సినిమాను సిల్వర్‌జూబ్లీ ఆడిస్తుంది" అని చెప్పా. అది అంత పెద్ద హిట్‌ అయింది. విశ్వనాథ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తున్న పెద్ద వంశీ 'నాగినీడు గారు.. పాతతరం నుంచి కొత్త తరానికి ట్రాన్సిషన్‌ చేయాలి. మీకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ తెలుసు కదా' అంటే ఒక షాట్‌ చేసిచ్చాను. అలా ఆ సినిమాలో నేను ఒక భాగమయ్యాను. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఫస్ట్‌ కాపీ చూసిన నన్ను అట్లూరి రామారావు గారు ఎలా ఉందని అడిగారు. వారితో 50డేస్‌, 100డేస్‌, సిల్వర్‌ జూబ్లీ పోస్టర్స్‌ ఆర్డర్‌ ఇచ్చేయండి అన్నా. ‘ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు’ సినిమా విషయంలోనూ అదే చెప్పా.

shnakarabharanam movie
శంకరాభరణం మూవీ

ఈ సినిమా ఆడదు అని తెలిసి కూడా బాగుంటుందని చెప్పిన సందర్భాలున్నాయా?

నాగినీడు: అడవి సింహాలు. అసోసియేట్‌ డైరెక్టర్‌ను పిలిచి.. ‘బాబు ఒక హీరోయిన్‌ను అడవులకు చేర్చడం కోసం వెధవరాలిని చేసి పంపిస్తున్నారు. జయప్రద గారిని అలా చేస్తే ఎవడు చూస్తారు? అది కరెక్ట్‌ కాదు. ఆలోచించండి. హిందీలోనైనా బాగా చేయండి’అని చెప్పా.

ఓ మహిళ వచ్చి.. ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలు చేయకండి అని చెప్పారట. ఎక్కడ? ఏ సినిమా?

నాగినీడు: బ్రహ్మీగాడి కథ. ఆ సినిమా అయిన తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక షోరూమ్‌ ప్రారంభోత్సవానికి నిత్యామేనన్‌తో కలిసి వెళ్లా. ఆ షోరూమ్‌ ఓనర్‌ భార్య నా దగ్గరికి వచ్చి 'అన్నయ్య గారు.. బ్రహ్మీగాడి కథ లాంటి సినిమాలు చేయొద్దండి. మొత్తం విలన్‌ క్యారెక్టర్‌ చేశారు. మాకు నచ్చలేదు' అని చెప్పారు.

మనం సినిమా చూడాలంటే కౌంటర్‌లో డబ్బులిస్తే టికెట్‌ ఇస్తారు.. మీరు గేట్‌ కీపర్‌కి పది పైసలు ఇచ్చి ప్రతి రోజు సినిమా చూసేవారట. ఏం సినిమా అది?

నాగినీడు: సంగం. నా చదువు అంతంత మాత్రమేనని మా అమ్మ నాలుగో తరగతి నుంచే ట్యూషన్‌ పెట్టించింది. అలాగే తొమ్మిదో తరగతిలోనూ ట్యూషన్‌ పెట్టిస్తే.. ట్యూషన్‌కు వెళ్లకుండా నా స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకొని.. థియేటర్‌ గేట్‌ కీపర్‌కిచ్చి లోపలికెళ్లి సినిమా చూసేవాడిని. అలా 25 సార్లు చూశా.

‘వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌’లో కుటుంబ రాజ్యాంగం అని తప్పులు లెక్కపెట్టారు. నిజ జీవితంలో అలాంటి రాజ్యాంగం ఏమైనా రాసుకున్నారా?

నాగినీడు: కచ్చితంగా ఉంటుంది. ఈ షోకి వచ్చే ముందు కూడా నా మనవరాలి అల్లరికి కొన్ని నియమ నిబంధనలు చెప్పాను. అది నా ఒరిజినల్‌ క్యారెక్టరే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో ఆఖరి సన్నివేశంలో ఆ క్యారెక్టర్‌ చెప్పే డైలాగ్‌లో కొన్ని మార్పులు చేశా.

భాష మీద పట్టు ఉంటేనే డైలాగ్‌లో మార్పులు చేయగలరు? మీరు ఆ బాటలోనే వస్తారుకుంటా?

నాగినీడు: చిన్న సినిమాల్లో ఓ సమస్య ఉంది. నేను ఏదైనా చెబితే వాళ్లకు నచ్చట్లేదు. ఓ రెండు సినిమాల్లో ఈ విషయం చాలా సీరియస్‌ అయింది. అందుకే అలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా.

మీ జీవితంలో మీరు భావోద్వేగాలకు గురవుతారా? కోపంగా ఉంటారా? పరిస్థితిని బట్టి మారుతారా?

నాగినీడు: అన్నీ ఉన్నాయి. పరిస్థితులను బట్టి మనం ఒదిగి ఉండాలి. గర్వం, స్వార్థం, అహంభావం వంటి వాటిని పాజిటివ్‌గా కూడా వాడొచ్చు. ఎలాగంటే.. మీకు ఒక ఉదాహరణ చెప్తా.. ఎల్వీ ప్రసాద్‌ గారు ఐ ఇన్‌స్టిట్యూట్‌కు ఐదు ఎకరాలు స్థలం ఇచ్చి.. ఆ రోజుల్లోనే రూ. 1.20కోట్లు ఇచ్చారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన ఏం చెప్పారంటే.. ‘నేను ఏదో ఆస్పత్రికి విరాళం ఇచ్చి.. ప్రజలకు ఏదో చేస్తున్నాను అని అనుకోవద్దు. అది తప్పు. దాంట్లో నా స్వార్థం ఉంది. కంటిచూపు సరిలేని వాళ్లు ఈ ఆస్పత్రికి వచ్చి కంటిచూపు సరిచేసుకొని థియేటర్‌కెళ్లి సినిమా చూస్తే మాకే కదా లాభం’అన్నారు. అది మంచి స్వార్థమే కదా. రాజమౌళి, కీరవాణి గారు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయినా వారు ఎంతో ఒదిగి ఉంటారు. అలా ఉండగలగడం ఒక అదృష్టం.

అందుకే, నేను కూడా ఎక్కడపడితే అక్కడ ఆటో ఎక్కేస్తా.. బస్‌ ఎక్కేస్తా. వీధుల్లో నడుచుకుంటూ వెళ్లిపోతుంటా. వీడిని ఎక్కడో చూశానే.. అనుకునేలోపు వెళ్లిపోతా. కానీ మాస్క్‌ వేసుకుంటే కళ్లను చూసి వెంటనే గుర్తుపడుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ అంతా హిందీ వాళ్లే ఉంటారు కదా.. వాళ్లు నేను మాస్క్‌ పెట్టుకొని ఉన్నా గుర్తుపట్టి.. మీరు ఏం సినిమాలు చేస్తున్నారని అడుగుతుంటారు. నన్ను గుర్తుపడతారా? అని అడిగితే.. మీ సినిమాలు అన్ని డబ్బింగ్‌లో చూస్తుంటామని చెప్పారు. ఇప్పుడు ఉత్తర భారతీయులంతా మన దక్షిణాది సినిమాలను డబ్బింగ్‌లో చూస్తున్నారు.

మీరు నటుడయ్యాక ప్రసాద్‌ ల్యాబ్‌కు వెళ్లారా? రమేశ్‌ గారి నుంచి స్పందన ఎలా ఉంది?

నాగినీడు: డబ్బింగ్‌ ఉన్నప్పుడు వెళ్తుంటా. రమేశ్‌ను ఎప్పుడూ కలుస్తా. నా తొలి సినిమా 'పల్లికూడం'లో దర్శకుడు మెచ్చుకున్న సీన్‌నే చూపించా. ఎక్సలెంట్‌గా చేశావన్నారు. మిర్చిలో ఓ సన్నివేశం చూసి కూడా చాలా మెచ్చుకున్నారు. ఆయనకు నేనంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం.

సినిమాల్లో అవకాశం రాగానే రాజీనామా చేశారా?

నాగినీడు: లేదండి. సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. 2016 వరకు అక్కడ పనిచేస్తూనే ఉన్నా. ఎందుకంటే.. అదో సెంటిమెంట్‌. వాళ్లు వెళ్లిపోమంటే వెళ్లిపోవాలి కానీ.. నా అంతట నేను వదిలివెళ్లకూడదని అనుకున్నా.

మన ఇండస్ట్రీలో బాగా స్నేహంగా ఉండేవారు ఎవరు?

నాగినీడు: నేను ఎప్పుడూ ఎవరితో టచ్‌లో ఉండను. ఏదో పనిచేస్తూ బిజీగా ఉంటా. అయినా బెనర్జీ గారితో పరిచయం ఉంది కాబట్టి.. తరచూ కలుస్తుంటా. సినిమాలు చూస్తే.. రావు రమేశ్‌కు ఫోన్‌ చేస్తా. తర్వాత కాశీ విశ్వనాథ్‌ గారికి. రఘుబాబు గారికి నేనంటే చాలా ఇష్టం. ఆఫ్‌కోర్స్‌ మీతో.. మీ తమ్ముడి ఖయ్యుంతో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.