ETV Bharat / sitara

రాష్ట్రంలో నేటినుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

కరోనా కారణంగా మూగబోయిన సినిమా థియేటర్లు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతినివ్వడంతో రేపటి నుంచి అన్ని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా థియేటర్లలో సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా యాజమాన్యాలు జాగ్రత్తలు చేపట్టాయి.

theater
theater
author img

By

Published : Dec 4, 2020, 12:04 AM IST

రాష్ట్రంలో నేటినుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

రాష్ట్రంలో మూతపడిన సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు 9 నెలలుగా తెరుచుకోని హాళ్లలో ప్రదర్శనలు మొదలుపెట్టాలని తెలంగాణ సినిమా థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు తెలుగు నిర్మాతల మండలితో... మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమానులు జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో తెరపై బొమ్మ పడనుంది. కేవలం 50 శాతం ప్రేక్షకులతోనే సినిమాలను ప్రదర్శించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీటుకు సీటుకు మధ్య క్రాస్ మార్క్ చేశారు. టికెట్ కౌంటర్ల వద్ద దూరం పాటిస్తూ... తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే బోర్డులను ఏర్పాటు చేశారు. హాల్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.

హాలీవుడ్​ చిత్రాలతో

ప్రస్తుత పరిస్థితుల్లో సినియాలకు ప్రేక్షకుల రావడం ప్రశ్నార్థకంగా ఉందని థియేటర్ల యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలో తొలుత హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా "టెనెట్" చిత్రంతో థియేటర్లను పునఃప్రారంభిస్తున్నారు. 2 వారాల తర్వాత తెలుగు సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు సిద్ధమవుతున్నారు. నాని నటించిన "వీ" సినిమాను ఈనెల 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

అంచనాతో పెద్ద సినిమాలు

ఓటీటీల్లో విడుదలైన మరిన్ని హిట్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రేక్షకుల రాకను అంచనా వేసి పెద్ద సినిమాలను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన "సోలో బ్రతుకే సో బెటర్" ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని నమ్ముతున్న థియేటర్ యజమానులు... సంక్రాంతికి పరిస్థితి చక్కబడుతుందని అభిప్రాయపడుతున్నారు.

వారిలో ఉత్సాహం

రానా నటిస్తున్న అరణ్య, మాస్‌ మహారాజ్‌ రవితేజ క్రాక్‌ చిత్రం, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్... రెడ్ లాంటి పెద్ద సినిమాలతోపాటు అనేక చిన్న సినిమాలు థియేటర్‌లో విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. థియేటర్లు పునఃప్రారంభమవుతుండడంతో దర్శక నిర్మాతలు, నటీనటుల్లో ఉత్సాహం నెలకొంది.

ఇదీ చదవండి : వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్​ 8 వరకు స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.