కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడు. ఎవరితోనూ కలవకుండా ముభావంగా ఉంటున్నాడు. దీన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన ఇన్స్టాలో వెల్లడించాడీ పాప్ గాయకుడు. కొన్ని రోజులుగా కుంగుబాటుపై చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపాడు బేబీ సింగర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నేను ఎప్పటిలాగే తిరిగి మీ ముందుకు వస్తాను. దీని గురించి పెద్దగా బాధ పడట్లేదు. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను. నా కోసం భగవంతుడిని ప్రార్థించండి. నా జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితిని అనుభవిస్తున్నాను"
--జస్టిన్ బీబర్, పాప్ గాయకుడు
చిన్నవయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు బీబర్. వయసుకి మించిన పేరు ప్రఖ్యాతలు అతడిపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని ఆయన బార్య హెయిలే బాల్ద్విన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.