వెండితెరపైనా, బుల్లితెరపైనా నటుడిగా అతడికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతాడు. సినిమా.. రియాల్టీ షో.. వెబ్ సిరీస్ మాధ్యమం ఏదైనా అందులోని పాత్రకు తగ్గట్లు చేస్తాడు. 'జై' కొట్టి వెండితెరకు పరిచయమై, 'గౌతమ్‌గా ఎస్.ఎస్.సి' పాసై, 'చందమామ'తో కలిసి ప్రేమను మరిపించి, మురిపించిన యువ కథానాయకుడు నవదీప్(Navdeep). ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు సినిమాల్లో తాను ఎలా వచ్చింది? కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, ఇలా ఎన్నో విషయాలను సరదాగా నవ్వుతూ పంచుకున్నాడు!
అలా సినిమాల్లోకి..
సినిమాల్లోకి రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందనే విషయాన్ని అలీతో పంచుకున్నారు నవదీవ్. "విజయవాడ ఊర్వశి థియేటర్‌లో సినిమా చూసి రిక్షా ఎక్కి ఇంటికి వెళ్తుంటే రిక్షా తొక్కే వ్యక్తి 'మీరు చాలా బాగున్నారు బాబు. సినిమా హీరో అవ్వొచ్చు కదా' అన్నాడు. అది నా మైండ్‌లో బాగా నాటుకు పోయింది. తేజగారు రాకముందు సినిమాల్లో అవకాశం అంటే, ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. జీవితం ఇక అయిపోయినట్లే అనుకుని అవకాశాల కోసం తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తేజ సినిమాలో అవకాశం వచ్చింది. 'నువ్వు సినిమాల్లో నటిస్తున్నట్లు ఇంట్లో తెలుసా?' అని మా అమ్మానాన్నలను పిలిపించారు. వాళ్లకూ అప్పుడే తెలిసింది. తేజ లాంటి డైరెక్టర్ అవకాశం ఇస్తానంటే ఎవరైనా ఎందుకు వద్దని చెబుతారు. దాంతో ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకొన్నారు" అని నవదీప్ చెప్పాడు.
అలా ఫేమస్ అయ్యా!
ఒకానొక సందర్భంలో విపరీతంగా పార్టీలు ఎంజాయ్ చేసేవాడ్ని అని నవదీప్ అన్నారు. రాత్రి 8గంటలైతే క్లబ్‌కు వెళ్లిపోయి అర్ధరాత్రి వరకూ తిరిగి, ఆ తర్వాత బిర్యానీ తిని, తెల్లవారుజామున 5గంటలకు ఇంటికి చేరేవాడిని అని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో మీడియా మిత్రులు తనను బాగా ఫేమస్ చేశారని(వ్యంగ్యంగా) చెప్పారు. 'బిగ్‌బాస్'(BiggBoss Season 1 Telugu) షోలో పాల్గొన్న తర్వాత తానెంటి అనేది ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.
సోనాలికి పెద్ద అభిమానిని..
'ఇంద్ర', 'మురారి' సినిమాలు చూసినప్పుడు హీరోయిన్ సోనాలీ బింద్రే(Sonali Bendre)కు వీరాభిమానినిగా మారినట్లు నవదీప్ చెప్పారు. "ఎంతలా అంటే శ్రీదేవిని చూసి ఆర్జీవీ ఎలా ఫీలవుతారో నేను కూడా సోనాలి బింద్రేను చూసి దేవతలా ఫీలవుతా" అని ఆయన అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. 'అందుకే మెగా కాంపౌండ్ హీరో అంటున్నారు'