నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. రష్మి వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతోంది.
మార్చి 19న ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ పౌరాణిక నేపథ్యంలోని స్కిట్‌తో తమదైన ఆటోపంచ్లతో అలరించారు. కెవ్వు కార్తిక్ టీమ్‌లో ఇమ్మాన్యుయేల్, వర్ష ప్రేమికులుగా కనిపిస్తూ.. తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. బులెట్ భాస్కర్, సునామీ సుధాకర్ కలిసి తమదైన మార్క్ కామెడీ.. పోలీస్, సనత్‌నగర్ సత్తి పాత్రలతో కామెడీ పంచారు. ఈ స్కిట్లో గబ్బర్‌సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్‌లోని ఇద్దరు నటులు నటించారు. మరోవైపు రాకింగ్ రాకేష్ మధ్య తరగతి నేపథ్యంలోని స్కిట్‌తో నవ్వులు పూయించారు.
ఇదీ చూడండి: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్.. 'పాగల్' హీరోయిన్ ఫస్ట్‌లుక్