నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. రష్మి వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ షో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఎపిసోడ్‌కు 'ఏ1 ఎక్స్‌ప్రెస్' హీరోహీరోయన్లు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ ఎపిసోడ్లో సుడిగాలి సుధీర్ టీమ్‌లో అరబ్ భాషతో అదరగొట్టాడు గెటప్ శ్రీను. అలాగే ఇమ్మాన్యూయేల్, వర్ష జోడీ వృద్ధ దంపతులుగా చేసి అలరించారు. కొమరక్క.. రాకేశ్‌ను కొట్టడం, మైఖెల్ జాక్సన్ డ్యాన్స్‌లతో బుల్లెట్ భాస్కర్ అవస్థలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పూర్తి ఎపిసోడ్ చూడాలంటే రాత్రి 9.30 గంటల వరకు ఎదురుచూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసి నవ్వుకోండి.