ETV Bharat / sitara

రోజా వర్సెస్​ ఇంద్రజ- సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ హోరాహోరీ పోటీ - etv vinayaka chavithi program

ఒకప్పుడు హీరోయిన్లుగా అలరించిన రోజా, ఇంద్రజ.. సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈసారి వినాయకచవితికి ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేసి​ కాస్త ఫన్​ డోస్​ పెంచింది ఈటీవీ. ఈ షోలోనే నటీమణులిద్దరూ ఓ విషయంలో తెగ పోటీపడ్డారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఈ ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది. దీన్ని మీరూ చూసేయండి..

roja vs indraja
రోజా వర్సెస్​ ఇంద్రజ
author img

By

Published : Aug 29, 2021, 10:14 PM IST

ప్రతి పండగకు ప్రత్యేక షోలు నిర్వహించి, తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈటీవీ. ఈసారి వినాయక చవితికి ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేందుకు సిద్ధమైంది. 'ఊరిలో వినాయకుడు' పేరుతో ప్రోగ్రాం ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన రెండో ప్రోమోను విడుదల చేయగా అది కాస్తా.. యూట్యూబ్​లో బాగా సందడి చేస్తోంది.

రష్మి ప్రేమించాలంటూ..

సుడిగాలి సుధీర-రష్మి ఒకరిమీద ఒకరు పంచ్​లు వేసుకుంటూ చేసిన యాంకరింగ్​తో మొదలైన ఈ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ క్రమంలోనే రష్మి తనను ప్రేమించాలంటూ తన మనసులోని మాటను వినాయకుడి ముందు పెట్టాడు సుధీర్​.

రోజా వర్సెస్​ ఇంద్రజ

లడ్డు వేలంపాట కోసం రోజా, ఇంద్రజ టీమ్ హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సీనియర్​ నటీమణులిద్దరూ ఒకరిపై మరొకరు సెట్టైర్లు వేసుకుంటూ సరదా వాగ్వివాదానికి దిగారు. ఆ పంచ్​ల నుంచి వారిని డైవర్ట్​ చేయడం కోసం హైపర్​ ఆది కలుగజేసుకుని 'కామెడీ చేయమంటే ఆటో వెనుక కొటేషన్స్ చెప్తారేంటిరా..' అంటూ నవ్వులు పూయించాడు. ​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హగ్స్​ పోటీ

ఇక హైపర్​ ఆది, రాంప్రసాద్​ కలిసి ఓ షాపింగ్​ మాల్​లో అమ్మాయిల విషయంలో తలపడుతూ సందడి చేశారు. తామిద్దరిలో ఆడపిల్లలు ఎవరికి ఎక్కువ హగ్స్​ ఇస్తారంటూ పోటీకి దిగారు. దీనికి సంబంధించిన వీడియోను షోలో ప్రసారం చేసి కితకితలు పెట్టించారు.

తారల సందడి

బుల్లితెర సెలబ్రిటీస్​, సిరీయల్​ తారలు, హీరో శ్రీకాంత్​, రాజ్​తరుణ్​, నటుడు అజయ్​ సహా పలువురు నటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైపర్​ ఆది, సుధీర్​, రాంప్రసాద్​, గెటప్​ శ్రీనుతో కలిసి పంచ్​లు, సెట్టైర్లు వేస్తూ సరదాగా నవ్వించారు.

బిచ్చగత్తిగా వర్ష

ఇక ఇమ్మాన్యుయెల్​, వర్ష భిక్షగాళ్ల వేషంలో రోడ్లపై చేసిన ప్రాంక్​ కామెడీ మాములుగా లేదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఆ వీడియోను షోలో ప్రసారం చేశారు.

అదిరే స్టెప్పులతో

​షోలో భాగంగా ప్రముఖ నటి ఇంద్రజ స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి అందరి చూపుల్ని తనవైపు తిప్పుకొన్నారు. "నీ జీను ప్యాంట్​ చూసి బుల్లెమో.." పాటకు ఆమె వేసిన స్టెప్పులు చూసి అందరూ వావ్‌ అనకుండా ఉండలేకపోయారు. నటి రోజా కూడా ఇంద్రజ డ్యాన్స్​కు ఫిదా అయిపోయారు.

మొత్తంగా సెప్టెంబరు 10న వినాయకచవితి రోజు ఈ పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అప్పటివరకు ప్రోమోను చూసేయండి..

ఇదీ చూడండి: వినాయకచవితికి సుధీర్ 'భీమ్లా నాయక్' సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.