తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు సూర్య, మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు ఎంతటి సుపరిచితులో తెలిసిందే. మరి సినిమాల్లో వాళ్లకు తెలుగులో డబ్బింగ్ చెప్పేదెవరో తెలుసా..? వాళ్లకు గొంతునిచ్చేది డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్. మోహన్‌లాల్, సూర్య, విక్రమ్, అజిత్, ఉపేంద్ర ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు.
'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'లో శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒకేసారి పలువురు స్టార్‌హీరోల గొంతులు వినిపించి అందర్నీ అలరించారు. హీరోలకు సినిమాల్లో నుంచి పవర్‌ఫుల్ డైలాగులను గుక్కతిప్పుకోకుండా చెప్పగా.. కార్యక్రమంలో ఉన్నవాళ్లంతా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో యూట్యూబ్‌లో ఉంది. మీరూ చూసేయండి మరి...
- " class="align-text-top noRightClick twitterSection" data="">