'ఢీ 13: కింగ్స్ vs క్వీన్స్' లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. ఈ ఎపిసోడ్లో భాగంగా కొరియోగ్రాఫర్‌తో కలిసి కంటెస్టెంట్లు డ్యాన్స్ చేశారు. 'ఆచార్య'లోని 'లాహే లాహే' పాటకు చేసిన నృత్యం చూడముచ్చటగా అనిపిస్తుంది.
' చంద్రముఖి'లోని 'రారా సరసకు రారా' గీతానికి క్లాసికల్, వెస్ట్రన్ కలిపి చేసిన డ్యాన్స్ మెప్పించింది. ఇదే పాటలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన చలాకీ చంటి.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'నరసింహా' డైలాగ్‌తో అదరగొట్టారు.
మరోవైపు కంటెస్టెంట్లు సాయి-నైనిక.. 'సామజవరగమన' పాటకు చేసిన డ్యాన్స్ క్యూట్‌గా ఉంది! వారిద్దరి మధ్య ఏం ఉంది? అని యాంకర్ ప్రదీప్ అడగ్గా.. దానికి నైనిక నవ్వుతూ సమాధానమిచ్చింది. దీని పూర్తి ఎపిసోడ్ జులై 28న రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: