'జై'-ప్రదీప్, జానీ-గణేశ్ మాస్టర్, అరుంధతి-పూర్ణ, మిత్రవింద-ప్రియమణి, ఇంద్ర-సుడిగాలి సుధీర్, జెస్సీ-రష్మి, కాలభైరవ- హైపర్ ఆది, అతిలోకసుందరి-దీపిక.. ఇలా వీరందరూ అదిరిపోయే గెటప్ల్లో కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారు. 'ఢీ' ప్రోమోలో వీళ్లంతా తెగ సందడి చేశారు.
ఈ వారం 'వకీల్‌సాబ్', 'అర్జున్‌రెడ్డి', 'బిజినెస్‌మేన్', 'నరసింహ', 'జయం', 'సై' సినిమాల కథ ప్రతిబింబించేలా ఆరుగురు కంటెస్టెంట్లు అదిరిపోయే డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్లు చేశారు.
![Dhee 13 Latest Promo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12684544_dhee.png)
'నరసింహ'లో రజనీకాంత్ పాత్రతో సుధీర్ మెప్పించగా.. ప్రియమణి, పూర్ణ.. రమ్యకృష్ణ, సౌందర్య పాత్రల్లో చేసిన అభినయం ఆకట్టుకుంది.
'వకీల్‌సాబ్' డ్యాన్స్ ప్రదర్శనలో అమ్మాయిలపై అఘాయిత్యాల లిరిక్స్‌కు ఎమోషనల్ అయిన గణేశ్ మాస్టర్.. తన ఆవేదనను ఆపుకోలేకపోయారు. తాను కంటతడి పెట్టడమే కాకుండా కంటెస్టెంట్లు, వ్యూయర్స్‌ను కూడా కంటతడి పెట్టించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: