ETV Bharat / sitara

తెలుగు తెరపై 'ఛార్మి' మంత్రం - చార్మీ

ప్రతి సంవత్సరం ఎంతో మంది కథానాయికలు తెలుగు తెరపై సందడి చేస్తుంటారు. కాని స్థిరమైన స్థానం సంపాదించుకొని, స్టార్‌లుగా మెరిసే ముద్దుగుమ్మలు తక్కువ. తన నటనతో చక్కటి గుర్తింపు పొందిన నాయిక ఛార్మి. నేడు ఛార్మి 32వ జన్మదినం.

తెలుగు తెరపై 'ఛార్మీ' మంత్రం
author img

By

Published : May 17, 2019, 6:10 AM IST

Updated : May 17, 2019, 7:03 AM IST

ఎందరో కథానాయికలకు కేరాఫ్​ అడ్రస్​ టాలీవుడ్​. ప్రతి ఏడాది ఎంతో మంది నూతన హీరోయిన్లు​గా తెలుగు సినిమాల్లో నటించి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కానీ నాయికా ప్రాధాన్యంతో కూడిన కథలకి కేరాఫ్‌గా నిలుస్తూ, నటనపరంగానూ శభాష్‌ అనిపించుకొనేవాళ్లని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. వారిలో ఛార్మి ఒకరు.

కమర్షియల్‌ నటిగానే కాకుండా... మంచి నటనతోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఛార్మి. నేడు 32వ వసంతంలోకి అడుగుపైడుతున్న సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

పంజాబీ బొమ్మ...

ముంబయిలో పుట్టి పెరిగిన పంజాబీ పడుచు ఛార్మి. మే 17, 1987న సిక్కు కుటుంబంలో ఆమె జన్మించింది. కార్మెలైట్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌లో చదువుకొంది. పాఠశాల విద్య చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు అందుకొంది ఛార్మి. తెలుగు తెరపై తొలినాళ్లల్లో పాల బుగ్గలతో, కాస్త బొద్దుగా దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ.
కృష్ణవంశీ కళారూపం...

‘నీ తోడు కావాలి’ ఛార్మి తొలి చిత్రం. ఆ తర్వాత తమిళం, మలయాళం నుంచి అవకాశాలు అందుకొంది. 2003లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘శ్రీ ఆంజనేయం’లో నటించడం ఛార్మి కెరీర్‌కే ఓ పెద్ద మలుపు. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినా ఛార్మికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘గౌరి’, ‘చంటి’, ‘మాస్‌’, ‘చక్రం’, 'మంత్ర', ‘అనుకోకుండా ఒకరోజు’, ‘పొలికల్‌ రౌడీ’, ‘అల్లరి పిడుగు’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘లక్ష్మి’, ‘స్టైల్‌’, ‘పౌర్ణమి’, ‘చిన్నోడు’, ‘రాఖి’, ‘లవకుశ’, ‘మంత్ర’, ‘సుందరకాండ’, ‘భలే దొంగలు’, ‘మైఖైల్‌ మదనకామరాజు’... ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో పలువురు అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడింది. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటించి ఛార్మి పేరు తెచ్చుకొంది.

బాలీవుడ్​లోనూ...

హిందీలోనూ ‘బుడ్డా హోగా తేరా బాప్‌’, ‘జిల్లా గజియాబాద్‌’, ‘రాంబో రాజ్‌కుమార్‌’ తదితర చిత్రాలు చేసి మెరిపించింది.

నంది మంత్రం..

‘మంగళ’ చిత్రంతో ఉత్తమ నటిగా జ్యూరీ, ‘మంత్ర’కిగానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాలు అందుకొంది.

స్మార్ట్​ నిర్మాతగా​...

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘జ్యోతిలక్ష్మి’తో ఆమె నిర్మాతగా మారింది. పూరి కనెక్ట్స్‌ సంస్థ బాధ్యతలు చూసుకుంటూనే, ఇటీవల పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలన్నింటికీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది ఛార్మి. ప్రస్తుతం రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది ఛార్మి.

  • massive surprise a day bfore my Bday @ramsayz gifts me sumthing tat i hv been wanting from quite sum tm,best part is he thought abut wt Wud i like n carried it al d way to Our outdoor shoot n ur quote to me 😂 I can’t stop laughing 😂
    Thanks for everything my #ismartshankar 🤗❣️ pic.twitter.com/TK8lkU3wi1

    — Charmme Kaur (@Charmmeofficial) May 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Citizens Bank Park, Philadelphia, Pennsylvania, USA. 15th May 2019.
1. 00:00 Shaking manager Gabe Kapler's hand in the dugout
2. 00:04 Posing for pictures pre-game with various players
3. 00:18 Taking batting practice
4. 00:26 He throws out the ceremonial first pitch, but bounces it to home plate (some boos from the crowd)
5. 0:38 In the stands watching the game
SOURCE: MLB
DURATION: 00:51
STORYLINE:
Hollywood star Bruce Willis threw the ceremonial first pitch in a Phillies Jersey before the team played against the Milwaukee Brewers in the MLB (Major League Baseball) on Wednesday, but it did not go according to plan, as Willis' throw bounced before it reached Phillies pitcher Aaron Nola and the 64-year-old appeared to be booed by the crowd.
Last Updated : May 17, 2019, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.