ETV Bharat / sitara

'రూ.3 లక్షల జీతం వదిలొచ్చా.. హీరోనయ్యాక పెళ్లిచేసుకుంటా' - వెబ్ సిరీస్ లేటేస్ట్ తెలుగు

'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్​తో గుర్తింపు తెచ్చుకున్న చైతన్యరావు.. తన వ్యక్తిగత, కెరీర్​కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ సిరీస్​లో ఎలా అవకాశం వచ్చిందో వెల్లడించారు.

30 weds 21 web series fame chaitanya rao interview
'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్
author img

By

Published : Jun 12, 2021, 8:26 AM IST

తెరపై మెరవడం తన కల... అయినా అమ్మానాన్నల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు... ఎమ్మెన్సీలో మిలియన్ల జీతమొచ్చే ఉద్యోగం సంపాదించాడు... కానీ స్వప్నం కుదురుగా ఉండనిస్తేగా! కొంచెం నెటిలవగానే వెనక్కి తిరిగొచ్చాడు... స్టూడియోల చుట్టూ చక్కర్లు కొట్టాడు... కొన్ని సినిమాల్లో మెరిసి, ఆపై చిన్నితెర బాట పట్టాడు... '30 వెడ్స్ 21'లో పక్కింటి కుర్రాడిగా అందరి మెప్పించిన ఆ కరీంనగర్ యువకుడే మాదాడి చైతన్యరావు.

70, 80, 90 లక్షల వ్యూస్.. '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్​కు వారం గడవకముందే వచ్చిన వీక్షణలు ఇవి. వెబ్ సిరీస్​ శకంలో ఇదొక రికార్డు. మంచితనం పోతపోసిన కుర్రాడిగా.. జనరేషన్ గ్యాప్ ఉన్న పడుచు భార్యతో సతమతమయ్యే భర్తగా పాత్రలో ఒదిగిపోయి అందర్నీ మెప్పించాడు చైతన్య. వెండితెర నుంచి బుల్లి తెరకొచ్చి స్టార్ గా మారిన ప్రస్థానం అతడి మాటల్లోనే.

30 weds 21 web series fame chaitanya rao
చైతన్యరావు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తే దక్కిన విజయం ఇది. పృథ్వీ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, ఉద్యోగిగా, ఫ్రెండ్​గా, మన ఇంట్లోని అబ్బాయిగా అందరికీ కనెక్ట్ అయ్యా. సిరీస్ మొత్తం ఎక్కడా అసభ్యత, ఆశ్లీలతకు తావు లేదు. పిల్లల నుంచి ముసలివాళ్ల దాకా అంతా కలిసి చూసేలా ఉంది గనకే అంత విజయం సాధించింది. అయితే ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చిందేం కాదు. దీని వెనకాల ఎంతో కష్టముంది. చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే పిచ్చి. ఎక్కడ షూటింగ్​లు ఉంటే అక్కడ వాలిపోయేవాణ్ని. సినిమాల కోసం స్కూల్, కాలేజీ బంక్ కొట్టిన రోజులు బోలెడు. అప్పట్లో రాఘవేంద్రరావు 'పరదేశీ' సినిమాను కొత్తవాళ్లతో తీస్తున్నారని తెలిసి ఫొటోలు పట్టుకొని ఆడిషన్​కు వెళ్లా. కొద్దిలో ఛాన్స్ మిస్ అయింది. నా ప్రయత్నాలు తిరుగుళ్లు చూసి అమ్మానాన్నలు హైరానా పడిపోయారు. 'మనకు చదువు ముఖ్యం. పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది కదా.. ముందు మంచి ఉద్యోగం సంపాదించు' అన్నారు. వాళ్ల మాట కాదనలేక డిగ్రీ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాను. అక్కడే ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగంలో చేరాను. తర్వాత చెల్లి పెళ్లి కూడా అయింది. ఆర్థికంగా కొంచెం ఫర్వాలేదు. ధైర్యం వచ్చింది. ఇంట్లోవాళ్లకు చెప్పకుండానే ఇండియా తిరిగొచ్చాను. అప్పుడు నా జీతం నెలకి రూ.3లక్షల దాకా ఉండేది. అంత మంచి జీతం వచ్చే ఉద్యోగం వదులుకోవడం ఎవరికి నచ్చలేదు. 'నువ్వొక్కడివేనా? లక్షల మంది ప్రయత్నిస్తున్నారు. అందరికీ సినిమా అవకాశాలు రావు కదా' అని తిట్టారు. వాళ్లను కష్టపడి ఒప్పించాను. తర్వాత యాక్టింగ్, డాన్స్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నా. ఆపై ట్రయల్స్ బాగా పెంచా. నా కష్టం ఫలించింది. 2016లో 'బందూక్' సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. నటనకు మంచి పేరు వచ్చినా అది పెద్దగా ఆడలేదు. అయినా నేను ప్రయత్నాలు ఆపలేదు. ప్రేమమ్, శమంతకమణి, గువ్వా గోరింక, హవా, వకీల్​సాబ్.. సినిమాల్లో హీరోగా, రెండో పాత్రలు చేశాను.

ఆ ఆశతోనే

ఫర్వాలేదు బండి ముందుకెళ్తుంది అనుకుంటుండగానే లాక్​డౌన్ వచ్చి పడింది. షూటింగ్​లు ఆగిపోయాయి. ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లోవాళ్లు నాతో సరిగ్గా మాట్లాడమే మానేశారు. ఖర్చుల కోసం కొన్ని వెబ్​సైట్​లలో పనిచేసేవాణ్ని. ఒకానొక సమయంలో ఇటువైపు వచ్చి తప్పు చేశానా? అనిపించేది. ఎంత బాధ ఉన్నా నటించాలనే ఆశ, నేనేంటో నిరూపించుకోవాలనే పట్టుదల మాత్రం తగ్గేది కాదు. ఇదేసమయంలో ఓటీలు, వెట్ సిరీస్ హవా మొదలైంది. అందులో పేరు, మంచి పరిచయాలు ఉన్నవాళ్లకే ఛాన్స్. నాకా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. నాకున్నదల్లా మంచి యాక్టర్ అనిపించుకోవాలి అనే తపనే. అప్పుడే 30 వెడ్స్ 21 గురించి తెలిసింది. ఆడిషన్​కు వెళ్తే సెలెక్ట్ అయ్యా. పృధ్వీగా జనం ముందుకొచ్చా. ఈ సిరీస్ అయ్యేసరికి చెప్పలేనంత పేరొచ్చేసింది. రోజూ విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. బాగా నటించావనీ.. అచ్చం మా అబ్బాయిలాగే ఉన్నావనీ.. ఎన్నో ప్రశంసలు. అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. జగపతిబాబులా ఉన్నావనీ.. శోభన్​బాబులా నటిస్తున్నావనీ అంటున్నారు. ఒకప్పుడు సినిమాలు, యాక్టింగ్ వద్దన్న అమ్మానాన్నలు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నాకూ సంతోషమే.

* సొంతూరు కరీంనగర్. అక్కడే చదువుకున్నా.

* నా మనస్తత్వం పృధ్వీలాంటిదే. ఎవరినీ నొప్పించను.

* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనుంది.

* చిరంజీవి అంటే ప్రాణం. ఒక్కసారైనా తెర పంచుకోవాలి.

* ఇంకా బ్రహ్మచారినే. సినిమా హీరోనయ్యాక పెళ్లి చేసుకుంటా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.