ETV Bharat / sitara

Sarpatta Review: ఆర్య 'సార్పట్ట' ఎలా ఉందంటే?​ - telugu movie review

ఆర్య నటించిన ద్విభాషా చిత్రం 'సార్పట్ట'. అమెజాన్ ప్రైమ్​ వీడియోలో గురువారం.. నేరుగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది! అయితే ఇందులో ఏయే అంశాలు బాగున్నాయి? ఇంతకీ కథేంటి?

'Sarpatta' movie telugu review
ఆర్య 'సార్పట్ట'
author img

By

Published : Jul 22, 2021, 6:39 AM IST

చిత్రం: సార్పట్ట, నటీనటులు: ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణ్‌; నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; రచన, దర్శకత్వం: పా.రంజిత్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

క్రీడా నేపథ్యంలో ముఖ్యంగా బాక్సింగ్‌ ఇతివృత్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ సినిమాలు వచ్చాయి. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన 'తుఫాన్‌' కూడా బాక్సింగ్‌ కథతో తీసిన చిత్రమే. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆర్య. రజనీతో 'కబాలి', 'కాలా' తీసి మంచి క్రేజ్‌ తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'సార్పట్ట'. పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బాక్సర్‌గా ఆర్య ఎలా చేశాడు? సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ కమర్షియల్‌ హంగులు జోడించే పా.రంజిత్‌ ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు?

.
ఆర్య

కథేంటంటే: ఆంగ్లేయులు తమ సరదా కోసం కొందరు భారతీయులకు బాక్సింగ్‌ నేర్పిస్తారు. అలా బాక్సింగ్‌ నేర్చుకున్న కొందరు తమ తర్వాత తరాల వారికి కూడా దాన్ని నేర్పుతారు. ఈ క్రమంలో కొందరి కుటుంబాల్లో బాక్సింగ్‌ వంశపారంపర్యంగా వస్తుంటుంది. అలా ఇడియప్ప, సార్పట్ట పరంపరలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పోటీ పడుతుంటాయి. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్‌లో కూలీగా పనిచేస్తుంటాడు సమరన్‌(ఆర్య). చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే పిచ్చి. స్కూల్‌ ఎగ్గొట్టి మరీ పోటీలు చూడటానికి వెళ్లేవాడు. అయితే, సమరన్‌ బాక్సింగ్‌ పోటీలకు వెళ్లడం తల్లి భాగ్యం(అనుపమ కుమార్‌)కు నచ్చదు. ఒకరోజు ఇడియప్ప× సార్పట్ట పరంపరల మధ్య జరిగిన బాక్సింగ్‌ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్‌ చేసి గెలుస్తానని సమరన్‌ ప్రతిజ్ఞ చేస్తాడు. సమరన్‌ బాక్సర్‌ అవడం అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? మరి సమరన్‌ ఎలా బాక్సర్‌గా మారాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి? ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్‌ కొక్కెన్‌)ని ఓడించాడా? సార్పట్ట పరంపర పరువును నిలిపాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

.
హీరో ఆర్య

ఎలా ఉందంటే: ప్రేక్షకుడికి ఉత్సాహం పంచుతూ, ఉత్కంఠ కలిగిస్తూ అలరించే చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ స్పోర్ట్స్‌ డ్రామా. ఎందుకంటే భావోద్వేగాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. అవే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. ఈ విషయంలో 'సార్పట్ట' దర్శకుడు పా.రంజిత్‌ సక్సెస్‌ అయ్యారు. గతంలో ఆయన తీసిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. కానీ, బాక్సింగ్‌ నేపథ్యంలో వచ్చిన 'సార్పట్ట' ఆ ఖాళీని పూర్తి చేసింది. 70వ దశకం చివరిలో విధించిన ఎమర్జెన్సీ కాలానికి బాక్సింగ్‌ నేపథ్యాన్ని జోడించి సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్‌ అంటే ప్రాణం పెట్టే ఓ యువకుడు అనుకోకుండా బాక్సర్‌గా మారడం, ఇరు వర్గాలు చేసే కుట్రల నుంచి తప్పించుకుని పోటీలో దిగడం తదితర సన్నివేశాలతో ఆసక్తిగా తీర్చిదిద్దాడు.

మొదటి అరగంటలో వచ్చే బాక్సింగ్‌ సన్నివేశాలు చూసే ప్రేక్షకుడిలో సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. దాన్ని ఏమాత్రం తగ్గకుండా ప్రథమార్ధమంతా కొనసాగించాడు దర్శకుడు. విరామానికి ముందు వచ్చే బాక్సింగ్‌ ఫైట్‌ చూస్తే సినిమా క్లైమాక్స్‌ ఫైటా? అన్న స్థాయిలో ఉంటుంది. అంతలా అలరించేలా ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ తీర్చిదిద్దారు. దీంతో ద్వితీయార్ధంలో ఏం చూపించబోతున్నాడా? అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. అయితే, ఎమర్జెన్సీ కారణంగా గురువు రంగయ్య(పశుపతి)జైలుకు వెళ్లడం వల్ల సమరన్‌ బాక్సింగ్‌ వదిలి చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అక్కడి నుంచి కథ కాస్త రాజకీయ రంగు పులుముకుంటుంది. తన మార్కు సామాజిక సమస్యను స్పృశించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తాగుడు వల్ల వచ్చే అనర్థాలను చెప్పే ప్రయత్నం చేసినా, అవన్నీ సాగదీతగా అనిపిస్తాయి. కథ గమనం నెమ్మది అయిపోతుంది. ఈ క్రమంలో ఒకట్రెండు భావోద్వేగ సన్నివేశాలు ఉన్నా, పెద్దగా మెప్పించవు. ఎప్పుడైతే జైలు నుంచి రంగయ్య బయటకు వచ్చాడో ఆ తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది. చివరి అరగంట, పతాక సన్నివేశాలు పరుగులు పెడతాయి. అవన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి. ఓవరాల్‌గా ఓ మంచి స్పోర్ట్స్‌ డ్రామా చూశామన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఇటీవల వచ్చిన 'తుఫాన్‌'తో పోలిస్తే, 'సార్పట్ట' ఇంకాస్త బెటర్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది.

.
.

ఎవరెలా చేశారంటే: సాధారణ యువకుడిగా, బాక్సర్‌గా సమరన్‌ పాత్రలో ఆర్య అదరగొట్టాడు. సమరన్‌ పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సర్‌గా ఆయన తీసుకున్న శిక్షణ, బాడీ లాంగ్వేజ్‌ మారిన తీరు మెప్పిస్తుంది. ఇక చెడు వ్యసనాలకు బానిసన అయిన వ్యక్తిగానూ తనదైన నటన కనబరిచాడు. సమరన్‌ భార్య పాత్రలో దుషారా విజయన్‌ చక్కటి హావభావాలు పలికించింది. ఆమె నటన సహజంగా ఉంది. ఇక తెరపై కనిపించిన ప్రతి బాక్సర్‌, నటుడు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సంచనా నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, జాన్‌ విజయ్‌, షబ్బీర్‌లు తమ పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఆంగ్లో ఇండియన్‌గా జాన్‌ విజయ్‌ సంభాషణలు అలరిస్తాయి. డ్యాన్సింగ్‌ రోజ్‌గా షబ్బీర్‌ నటన నవ్వులు పంచుతుంది. ఇక కోచ్‌ రంగయ్య పాత్రలో పశుపతి నటన సెటిల్డ్‌గా ఉంది.

.
.

సాంకేతికంగా.. సినిమా మరో స్థాయిలో ఉందనే చెప్పాలి. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం బాగుంది. పాటలు ఓకే. స్పోర్ట్స్‌ డ్రామాలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతం పాత్ర ఎంతో ఉంది. ఆ విషయంలో సంతోష్‌ నారాయణ్‌ మెస్మరైజ్‌ చేశారు. బాక్సింగ్‌ రింగ్‌లో వచ్చే శబ్దాలు నేచురల్‌గా ఉన్నాయి. మురళి.జి సినిమాటోగ్రఫీ సూపర్‌. బాక్సింగ్‌ పోటీలను ఆయన చూపించిన విధానం, చాలా బాగుంది. ముఖ్యంగా మొదటి 20 నిమిషాలు కనిపించే సన్నివేశాలు అల్టిమేట్‌ అని చెప్పవచ్చు. ఇక అన్బరివ్‌ యాక్షన్‌ సీన్స్‌ను చక్కగా తీర్చిదిద్దారు. బాక్సింగ్‌ రింగ్‌లో పడే ప్రతి పంచ్‌ డీటెయిల్డ్‌గా రావడం కోసం చాలా కృషి చేశారు. 70వ దశకం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ప్రతీ సన్నివేశాన్ని తీర్చిదిద్దడానికి ఆర్ట్ డైరెక్టర్‌ రామలింగం చాలా కష్టపడ్డారు. అందుకు మంచి మార్కులు పడతాయి. సెల్వ ఆర్‌.కె. ఎడిటింగ్‌ ఓకే. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. దర్శకుడు పా.రంజిత్‌ గత చిత్రాలకు భిన్నంగా స్పోర్ట్స్‌ డ్రామాను ఎంచుకుని దానికి పీరియాడికల్‌ టచ్‌ ఇచ్చి 'సార్పట్ట'ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రనూ చక్కగా రాసుకున్నారు. ప్రథమార్ధంలో ఉన్నంత జోష్‌ ద్వితీయార్ధంలో కూడా ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అదే విధంగా నిరాశకు గురయ్యే, కోచ్‌ రంగయ్య కొడుకు పాత్రను ఇంకాస్త డీటెల్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా ఒక ఫీల్‌గుడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాను పా.రంజిత్‌ ప్రేక్షకులకు అందించాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. ఆనాటి పరిస్థితులు అద్దం పట్టేలా కనపడేందుకు బాగానే ఖర్చు చేశారు.

బలాలు:

  • ప్రథమార్ధం
  • ఆర్య, ఇతర నటీనటులు
  • దర్శకత్వం
  • సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు:

  • ద్వితీయార్ధంలో ప్రారంభ సన్నివేశాలు
  • నిడివి

చివరిగా: 'సార్పట్ట'.. మరో కొత్తలోకంలోకి తీసుకెళ్లే పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.