ETV Bharat / sitara

రివ్యూ: 'ఆర్జీవీ దెయ్యం' భయపెట్టిందా? - స్వాతి దీక్షిత్ ఆర్జీవీ దెయ్యం

రాజశేఖర్​ హీరోగా రామ్​గోపాల్​ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆర్జీవీ దెయ్యం'. శుక్రవారం(ఏప్రిల్​ 16) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? రామ్‌గోపాల్ వ‌ర్మ కొత్త దెయ్యం భ‌య‌పెట్టిందా? అనే విశేషాలను ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

RGV Deyyam movie review
రివ్యూ: 'ఆర్జీవీ దెయ్యం' భయపెట్టిందా?
author img

By

Published : Apr 16, 2021, 10:42 AM IST

చిత్రం: ఆర్జీవీ దెయ్యం;

న‌టీన‌టులు: రాజ‌శేఖ‌ర్‌, స్వాతిదీక్షిత్‌, బెన‌ర్జీ, ఆహుతి ప్రసాద్‌, అనిత చౌద‌రి, జీవా, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌న, అనంత్ త‌దితరులు;

ఛాయాగ్రహ‌ణం: స‌తీష్ ముత్యాల‌;

సంగీతం: డి.ఎస్‌.ఆర్;

కూర్పు: స‌త్య, అన్వర్;

నిర్మాత‌: న‌ట్టికుమార్‌;

ద‌ర్శక‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ;

సంస్థ‌: న‌ట్టీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌;

విడుద‌ల‌: 16 ఏప్రిల్ 2021

దేవుడిని న‌మ్మను కానీ.. దెయ్యాన్ని మాత్రం న‌మ్ముతాన‌ని చెబుతుంటారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. భ‌య‌పెట్టడ‌మే తనకు ఇష్టం అంటుంటారు‌. అందుకేనేమో క్రమం త‌ప్పకుండా హార‌ర్ సినిమాలు చేస్తుంటారు. అప్పట్లో 'దెయ్యం' పేరుతో ఓ సినిమా చేశారాయ‌న‌. ఇప్పుడు 'ఆర్జీవీ దెయ్యం' పేరుతో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆరేళ్ల కింద‌టే 'ప‌ట్ట ప‌గ‌లు' పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన చిత్రమిది. కొన్ని మార్పుల త‌ర్వాత 'ఆర్జీవీ దెయ్యం'గా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? రామ్‌గోపాల్ వ‌ర్మ కొత్త దెయ్యం భ‌య‌పెట్టిందా.. లేదా?తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

RGV Deyyam movie review
ఆర్జీవీ దెయ్యం

క‌థేంటంటే?

శంక‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) ఓ కార్ మెకానిక్. కూతురు విజ్జీ (స్వాతి దీక్షిత్‌) కాలేజీకి వెళ్తుంటుంది. ఆమెలో క్రమంగా మార్పుల్ని గ‌మ‌నిస్తాడు శంక‌ర్‌. రాత్రిళ్లు న‌డ‌వ‌డం, గ‌ట్టిగా అర‌వ‌డం, భ‌య‌ప‌డ‌టం వంటివి చూశాక శంక‌ర్ ఆందోళ‌న‌కు గుర‌వుతాడు. వైద్యుల్ని సంప్రదిస్తాడు. విజ్జీ ప్రవ‌ర్తన చూసి వాళ్లే షాక్ అవుతారు. మాన‌వాతీత శ‌క్తులు ఉన్నాయ‌ని గ్రహిస్తారు. క్రమంగా సైకో కిల్లర్ గురులా మాట్లాడ‌టం మొద‌లుపెడుతుంది. ఆ తర్వాత ఆ ఊళ్లో జ‌రిగే హ‌త్యలన్నింటికీ తానే కార‌ణం అని చెబుతుంది. నిజంగా విజ్జీ ఆ హ‌త్యల‌కు పాల్పడిందా? సైకో కిల్లర్ గురుకీ, ఆమెకీ సంబంధ‌మేమిటి? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?

న‌వాతీత శ‌క్తులేవో ఉన్నాయ‌ని నమ్మిస్తూ.. చివ‌ర్లో అలాంటిదేమీ లేద‌ని, అదంతా మ‌న అభూత క‌ల్పనే అని నిరూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆత్మలు, అవి మ‌నుషుల్ని ఆవ‌హించ‌డాలు నిజ‌మేన‌‌ని చెప్పే సినిమాలు కొన్ని ఉంటాయి. రెండో కోవ‌కు చెందిన చిత్రమే ఇది. ఆత్మ ఆవ‌హించిన ఓ అమ్మాయి క‌థే ఈ చిత్రం. ఆత్మలు తాము ఆవ‌హించ‌డానికి ఎలాంటి శ‌రీరాల్ని ఎంచుకుంటాయి?వాటిని ఎలాంటి ప్రయ‌త్నాల ద్వారా భూత వైద్యులు వెళ్లగొడుతుంటార‌నే విష‌యాల్ని రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో ప్రస్తావిస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దారు.

ప‌ట్టప‌గలు.. చుట్టూ మ‌నుషుల్ని చూపెడుతూ ప్రేక్షకుల్లో భ‌యం పుట్టేలా ఆరంభ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శకుడు. అందుకే ఈ సినిమాకు మొద‌ట 'ప‌ట్టప‌గ‌లు' అని పేరు పెట్టాల‌నుకున్నారేమో. విజ్జీ త‌న‌కొచ్చే క‌ల‌ల‌తో నిత్యం భ‌య‌ప‌డుతూ, ఆందోళ‌న చెందుతూ క‌నిపిస్తుంటుంది. ప్రథ‌మార్ధం అంతా దాదాపుగా ఇదే తంతు. తెర‌పై క‌నిపించేది ఏది నిజం? ఏది క‌ల అనే గంద‌ర‌గోళం కూడా కొన్నిచోట్ల తలెత్తుతుంది. ఇందులో క‌థేమీ లేదు. ద్వితీయార్ధంలో ఆత్మ ల‌క్ష్యమేమిటి? విజ్జీనే ఎందుకు ఎంచుకుంద‌నే విష‌యాల్ని దెయ్యంతోనే చెప్పిస్తారు.

RGV Deyyam movie review
ఆర్జీవీ దెయ్యం

విజ్జీ శ‌రీరంలోకి ప్రవేశించిన ఆత్మ ఎవ‌రిది? ఎందుక‌లా చేస్తోంద‌నే ఆస‌క్తి చివ‌రి వ‌ర‌కు కొన‌సాగేలా చేశాడు ద‌ర్శకుడు. ఆ ఆత్మ క‌‌థ కూడా ద్వితీయార్ధంలో ఫ్లాష్‌బ్యాక్‌గా ఉంటుందేమో అనిపించినా.. అదేమీ లేకుండా సినిమాను పూర్తిచేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ మార్క్ కెమెరా కోణాలు, ఆయ‌న మార్క్ భీక‌ర‌మైన శ‌బ్దాల‌తో అక్కడ‌క్కడా కొన్ని స‌న్నివేశాలు భ‌య‌పెడ‌తాయంతే. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా సినిమా ఏమాత్రం ప్రభావం చూపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే?

రాజ‌శేఖ‌ర్ ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా క‌నిపించారు. తెర‌పై స‌హ‌జంగా క‌నిపించ‌డం త‌ప్ప‌.. ఆయ‌నకు న‌టించేందుకు పెద్దగా అవ‌కాశం లేని పాత్ర ఇది. త‌న కూతురికి ఎందుకిలా జ‌రుగుతోంద‌ని నిత్యం ఆందోళ‌న‌తో క‌న్నీళ్లు కారు‌స్తూ, ఆత్మ ఆవ‌హించిన‌ప్పుడు 'ఏం కాలేద‌మ్మా..' అని ఓదారుస్తూ క‌నిపిస్తుంటారంతే. స్వాతిదీక్షిత్ న‌ట‌నే ఈ చిత్రానికి హైలెట్‌. ఆమె ఆత్మ ఆవ‌హించిన యువ‌తిగా చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. మ‌గాడిలాగా, త‌న త‌ల్లిలాగా, కొన్ని స‌న్నివేశాల్లో విజ్జీలాగా మాట్లాడుతూ హావ‌భావాలు ప్రద‌ర్శించిన విధానం మెప్పిస్తుంది. స్వాతి న‌ట‌న మిన‌హా సినిమాలో చెప్పుకోదగ్గ విష‌యాలేమీ లేవు అనిపిస్తాయి.

అనిత చౌద‌రి, త‌నికెళ్ల భ‌ర‌ణి, అనంత్, స‌న త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. కొన్నేళ్ల కింద‌టే మ‌ర‌ణించిన ఆహుతి ప్రసాద్‌, దేవ‌దాస్ క‌న‌కాల వంటి న‌టులు ఈ సినిమాలో క‌నిపిస్తారు. ఇదెంత పాత సినిమా అనే విష‌యాన్ని గుర్తుచేస్తుంటాయి వారి పాత్రలు. సాంకేతికంగా స‌తీష్ ముత్యాల కెమెరా ప‌నిత‌నం, డి.ఎస్‌.ఆర్ సంగీతం మెప్పిస్తుంది. రామ్‌గోపాల్ వ‌ర్మ ఎంచుకున్న ఈ క‌థలో కానీ, క‌థ‌నంలో కానీ కొత్తద‌నం లేదు. స‌న్నివేశాలు కూడా ఇదివ‌ర‌కు చూసేసిన హార‌ర్ సినిమాల్ని గుర్తు చేస్తుంటాయి.

బ‌లాలుబ‌ల‌హీన‌తలు
స్వాతిదీక్షిత్ న‌ట‌నక‌థ‌.. క‌థ‌నం
ద్వితీయార్ధంగంద‌ర‌గోళంగా కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా: అక్కడ‌క్కడా భ‌య‌పెట్టే.. 'ఆర్జీవీ దెయ్యం'

గమనిక: ఈ సమీక్ష.. సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.