ETV Bharat / sitara

సమీక్ష: 'బెల్ బాటమ్' తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?

రిషబ్ శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బెల్‌ బాటమ్‌'. గతేడాది కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఓటీటీ వేదికగా నేడు తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Bell Bottom telugu Movie review
సమీక్ష: బెల్ బాటమ్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?
author img

By

Published : Dec 12, 2020, 3:08 PM IST

చిత్రం: బెల్‌బాటమ్‌

నటీనటులు: రిషబ్‌ శెట్టి, హరిప్రియ, అచ్యుత్‌కుమార్‌, యోగరాజ్‌ భట్‌ తదితరులు

సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌

సినిమాటోగ్రఫీ: అరవింద్‌ కశ్యప్‌

ఎడిటింగ్‌: కె.ఎం.ప్రకాశ్‌

నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కె.సి.

దర్శకత్వం: జయతీర్థ

విడుదల: ఆహా ఓటీటీ

ప్రపంచంలో భాషతో సంబంధం లేని కొన్ని సినిమాలు ఉంటాయి. అవి ఏ ప్రాంతం వారినైనా, ఏ జోనర్‌ ఇష్టపడేవారినైనా తమవైపునకు తిప్పుకుంటాయి. జేమ్స్‌బాండ్‌, డిటెక్టివ్‌ సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే. ఈ సినిమాల్లో అగ్ర హీరోలు నటిస్తే భారీ యాక్షన్‌ సన్నివేశాలు, ఫారెన్‌ లొకేషన్‌ పాటలతో నింపేస్తారు. అదే చిన్న హీరోలైతే కథ, కథనాలపై దృష్టి పెడతారు. అలా ఇటీవల కాలంలో తెలుగులో బాగా అలరించిన చిత్రాలు 'గూఢచారి', 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. 'కేజీఎఫ్‌'తో ఇప్పుడిప్పుడే కన్నడ ఇండస్ట్రీ గురించి యావత్‌ దేశానికి తెలుస్తోంది. అక్కడ కూడా మంచి ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైన చిత్రం 'బెల్‌ బాటమ్‌'. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నేడు 'ఆహా' ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో ఈ డిటెక్టివ్‌కు ఏ సమస్య ఎదురైంది? ఎలా పరిష్కరించాడు? అనే విషయాలు ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Bell Bottom telugu Movie review
బెల్ బాటమ్

కథేంటంటే!

వివిధ ప్రాంతాల్లో ఒంటిరిగా ఉన్న వారిని ఓ దొంగల గ్యాంగ్‌ దోచుకుంటూ ఉంటుంది. హేమగిరి పోలీసులు ఆ ముఠాను పట్టుకుని భారీ మొత్తంలో డబ్బు, నగలు స్వాధీనం చేసుకుంటారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ మొత్తాన్ని స్టేషన్‌లోని ఓ లాకర్‌లో పెడతారు. ఉదయం ఆ డబ్బును కోర్టులో సబ్‌మిట్ చేయడానికి లాకర్‌ ఓపెన్‌ చేయగా, అది ఖాళీగా ఉంటుంది. దీంతో పోలీసులు కంగుతింటారు. కొన్ని రోజుల తర్వాత పుష్పగిరి పోలీస్‌ స్టేషన్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటుంది. మరోవైపు డిటెక్టివ్‌ దివాకర్‌(రిషబ్‌ శెట్టి)కి చిన్నప్పటి నుంచి జేమ్స్‌ బాండ్‌ కథలు, డిటెక్టివ్‌ నవలలంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ ఎప్పటికైనా పెద్ద డిటెక్టివ్‌ అవ్వాలనుకుంటాడు. తండ్రి కిట్టప్ప(అచ్యుత్‌ కుమార్‌) హెడ్‌ కానిస్టేబుల్‌. కొడుకు డిటెక్టివ్‌ కావడం ఇష్టముండదు. దీంతో చనిపోయిన అతని తల్లిపై ఒట్టు వేయించి పోలీస్‌ స్టేషన్‌లో సెంట్రీగా పెడతాడు. ఓ కేసును తన తెలివి తేటలతో చాకచక్యంగా పరిష్కరించడం వల్ల పోలీస్‌స్టేషన్‌లో పోయిన నగదు కేసును దివాకర్‌కు అప్పగిస్తారు. మరి దివాకర్‌ ఆ కేసును ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? పోలీసులకు తెలియకుండానే అదీ పోలీస్‌స్టేషన్‌లో ఎలా దొంగతనం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Bell Bottom telugu Movie review
బెల్ బాటమ్

ఎలా ఉందంటే!

ఇప్పటి వరకూ అన్ని భాషల్లోనూ డిటెక్టివ్‌, జేమ్స్‌బాండ్‌ కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్ని చిత్రాలు దాదాపు ప్రేక్షకులను అలరించినవే. కారణం కథ, కథనాలు. ఒక సమస్య, దాని పరిష్కరించడానికి కథానాయకుడు రంగంలోకి దిగడం, ఒక్కో చిక్కుముడిని విప్పుకొంటూ వెళ్లడం. ఇలాంటి కథలకు కావాల్సింది ఉత్కంఠగా సాగుతూ, ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చొబెట్టే కథనం. అది ఉంటే చాలు. ‘బెల్‌బాటమ్‌’లో అది పుష్కలంగా ఉంది. పైగా ఈ కథకు మరో అడ్వాంటేజ్‌ ఏంటంటే కథ, కథనాలు ఎక్కడా సీరియస్‌గా సాగవు. ఈ సినిమా కోసం దర్శకుడు రెట్రో థీమ్‌ను తీసుకున్నాడు. కథ అంతా 80వ దశకంలో జరిగినట్లు చూపించాడు. మొదటి సన్నివేశంలోనే అసలు కథేంటో చెప్పేశాడు దర్శకుడు. పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు ఉండగానే వాళ్లకు తెలియకుండా డబ్బు దోచుకోవడం. ఇక ప్రేక్షకులు చేయాల్సిందల్లా.. కథానాయకుడు దాన్ని ఎలా పరిష్కరిస్తాడనేదే.

ఓ హత్య కేసును ఛేదించడం ద్వారా కథానాయకుడి బలం ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అక్కడి నుంచి దొంగతనం కేసు అతనికి వచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రపైనా అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. హీరో, అతని తండ్రి, స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. ఈ క్రమంలో హీరో-హీరోయిన్ల ప్రేమకథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అసలు కథ పక్కకు పోతోందేమోనని ప్రేక్షకుడు భావిస్తున్న తరుణంలో ఇన్‌స్పెక్టర్‌ పాత్ర ద్వారా దివాకర్‌ను తిట్టించి మళ్లీ కేసును పరిష్కరించే దిశగా మలుపు తిప్పాడు దర్శకుడు. అక్కడి నుంచి క్లైమాక్స్‌ వరకూ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్ధంలోనే కథానాయకుడు కేసు పరిష్కరించే దిశగా మరిన్ని అడుగులు వేస్తాడు. ఆ సన్నివేశాలన్నీ నవ్వులు పంచుతూనే ఆసక్తిగా సాగుతాయి. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ బాగుంది. పోలీసులు ఉండగానే పోలీస్‌స్టేషన్‌లో ఎలా దొంగతనం చేశారో చెప్పిన విధానంలో లాజిక్‌ మిస్సయినా, డిటెక్టివ్‌ కథల్లో ఆ లాజిక్‌ను నమ్మాల్సిందే. దొంగతనం వెనుక కథ భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎవరెలా చేశారంటే!

ఈ సినిమాలో నటించిన వారెవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కాదు. ఒక్క హీరోయిన్‌ హరిప్రియ ఒకట్రెండు తెలుగు సినిమాల్లో చేసిందంతే. కథానాయకుడు రిషబ్‌శెట్టి కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అప్పుడప్పుడు అక్కడి సినిమాల్లో తళుక్కన మెరిసే ఆయన ఈ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. ట్రైలర్‌ చూసిన వాళ్లెవరైనా నిజంగా ఇతను హీరోనేనా అని అనుమానం వ్యక్తం చేస్తారు. కానీ, సినిమా చూస్తే ఈ కథకు ఆయన తప్ప మరొకరు సరిపోరేమోనని అనిపిస్తుంది. ఒకవైపు నవ్వులు పంచుతూనే మరోవైపు కేసు పరిష్కరించే డిటెక్టివ్‌గా ఆయన నటన మెప్పిస్తుంది. కథానాయిక హరిప్రియది కూడా కీలక పాత్రే. రెట్రో లుక్‌లో ఆమె అందంగా కనిపించింది. ఇక ఈ చిత్రంలోని నటీనటులు, వారి పాత్రల పేర్లు, చిత్రీకరించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. పింటో పాత్ర పోషించిన సుజయ్‌ శాస్త్రి కడుపుబ్బా నవ్వించారు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ కశ్యప్‌ ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా చూపించాడు. ముఖ్యంగా ఈ కథకు రెట్రో లుక్‌ తీసుకొచ్చేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడింది. ఎక్కడా మోడ్రన్‌ లుక్‌ కనిపించకుండా జాగ్రత్త పడింది. ప్రతి సన్నివేశంలోనూ చిత్ర బృందం పడిన కష్టం కనిపిస్తుంది. డిటెక్టివ్‌ కథలకు సంగీతం ఎంతో ముఖ్యం. అజనీశ్‌ లోకనాథ్‌ నేపథ్య సంగీతం బాగుంది. కె.ఎం.ప్రకాశ్‌ ఎడిటింగ్‌లో నైపుణ్యం చూపించాడు. ఎక్కడా అనవసర సన్నివేశాలు లేవు. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలే కాస్త సాగదీతగా అనిపించినా సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. దయానంద్‌ టి.కె. అందించిన కథను దర్శకుడు జయతీర్థ చాలా చక్కగా చూపించారు. ప్రతి సన్నివేశాన్ని చక్కగా రాసుకున్నారు. ఎక్కడా పరిధులు దాటలేదు. ప్రతి పాత్రను దాని సామర్థ్యానికి మించి చూపలేదు. కథానాయకుడిని హైలైట్‌ చేయటం కోసం, అతని వీరత్వాన్ని చూపించడం కోసం అనవసర సన్నివేశాలు, భారీ యాక్షన్‌ సన్నివేశాల జోలికి పోలేదు.

బలాలు

+ కథ, కథనాలు

+ నటీనటులు

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- హీరో-హీరోయిన్ల లవ్‌ట్రాక్‌

చివరిగా: 'బెల్‌ బాటమ్‌' వేసుకున్న డిటెక్టివ్‌ దివాకరం మిమ్మల్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తాడు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.