కరోనా కారణంగా ఈ నెలలో నిర్వహించాల్సిన 63వ గ్రామీ అవార్డుల ఫంక్షన్ వాయిదా పడింది. దీంతో ఈ పురస్కార వేడుకను మార్చి 14న ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీ పురస్కారాల వేడుకను జనవరి 31న నిర్వహించాల్సింది. కరోనా వ్యాప్తి కారణంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సినీ, టెలివిజన్ కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. దీంతో గ్రామీ అవార్డుల వేడుక వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఇదీ చూడండి: థియేటర్లలోకి 100 శాతం ప్రేక్షకులు.. జూ.డాక్టర్ ఆవేదన