ETV Bharat / sitara

ప్రముఖ బ్యానర్​లో తేజ సజ్జా కొత్త సినిమా? - teja sajja new movie updates

యువహీరో తేజ సజ్జా.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో ఓ సినిమా చేయనున్నాడని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

teja sajja
తేజా సజ్జా
author img

By

Published : May 23, 2021, 12:26 PM IST

'జాంబిరెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా తనదైన నటనా శైలితో ఆకట్టుకున్నాడు. దీంతో అతడితో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో యూత్​ఫుల్​ ఎంటర్​టైనర్​గా రూపొందబోయే ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.

ఈ బ్యానర్​లోనే మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'చూడాలనివుంది' సినిమాతో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు సజ్జా. 'ఇంద్ర' సినిమాలోనూ చైల్డ్​ ఆర్టిస్ట్​గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడదే బ్యానర్​లో హీరోగా చేయనుండటం విశేషం.

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ వల్ల సజ్జా నటించిన తన రెండో చిత్రం 'ఇష్క్' విడుదల తేది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్​, పాటలు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. మరోవైపు శివానీ రాజశేఖర్​తో కలిసి 'వెన్నెల' మూవీలోనూ కనిపించనున్నాడు.

ఇదీ చూడండి: 'బుట్టబొమ్మ' పాట.. యూట్యూబ్​లో మరో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.