ETV Bharat / sitara

ఎన్టీఆర్​ సరికొత్త లుక్​ వైరల్​ - ఎన్టీఆర్​ న్యూలుక్​

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ సరికొత్త లుక్​లో దర్శనమిచ్చి అభిమానులను అలరించారు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన స్టిల్స్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.

Young tiger NTR NEW look goes viral
ఎన్టీఆర్​ సరికొత్త లుక్​ వైరల్​
author img

By

Published : Oct 15, 2020, 9:55 PM IST

అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను అలరించారు. అయితే, ఇది కొత్త సినిమా కోసం కాదండోయ్‌. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా ఆయన స్టిల్స్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. తీక్షణమైన చూపులతో ఉన్న ఎన్టీఆర్‌ స్టిల్స్‌ అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్‌ఆర్‌'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇందులో తారక్‌ 'కొమరం భీమ్‌'గా, చరణ్‌ 'అల్లూరి సీతారామరాజు'గా కనిపించనున్నారు. చారిత్రక కథా నేపథ్యాన్ని పోలిన కల్పితగాథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ లుక్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఆయా సన్నివేశాలను 'ఆర్ఆర్‌ఆర్‌' చిత్ర బృందం షూట్‌ చేసింది. దసరా కానుకగా అక్టోబరు 22న 'రామరాజు ఫర్‌ భీమ్‌'ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తారక్‌ నటించిన వాణిజ్య ప్రకటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం, చాలా రోజుల తర్వాత తమ అభిమాన కథానాయకుడు దర్శనమివ్వడం వల్ల ఫ్యాన్స్‌ తెగ ఆనందపడిపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.