తెలుగులో మంచి టైమింగ్ ఉన్న హీరోల్లో రాజ్‌తరుణ్ ఒకరు. హిట్లతో కెరీర్‌ను ప్రారంభించిన ఇతడు.. ఆ తర్వాత కాలంలో తన చిత్రాలతో నిరాశపరుస్తూ వస్తున్నారు. గతేడాది ఒరేయ్ బుజ్జిగా అంటూ మిశ్రమ ఫలితాన్ని అందుకోగా, ఆ తర్వాత 'పవర్‌ప్లే'తో మళ్లీ విఫలమయ్యారు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ కథానాయకుడు.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే హైదరాబాద్‌లో సొంతఇల్లు కొనుగోలు చేసిన రాజ్‌తరుణ్.. కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి మారారు. దీంతో తమ కుమారుడికి పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 'స్టాండప్ రాహుల్' సినిమాతో బిజీగా ఉన్న రాజ్‌తరుణ్.. ఆ తర్వాత విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మూడోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. హిందీ హిట్ 'డ్రీమ్‌గర్ల్' తెలుగు రీమేక్ కోసమే వీరిద్దరూ కలిసిపనిచేయనున్నారట. త్వరలో దీనిపై అధికారిక్ ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇది చదవండి: వివాహబంధంలో అడుగుపెట్టిన 'సాహో' భామ