బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. మానసిక ఒత్తిడి గురించి ఓ పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో నిరాశ, మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న వారితో తన అనుభవాలను పంచుకుంటూ, కొన్ని సూచనలు చేస్తోంది నటి దీపికా పదుకొణె. డిప్రెషన్‌తో బాధపడే వారు దాన్నుంచి కోలుకోవడానికి రోజువారి అభ్యాసాలను ఇస్తోంది. వాటన్నింటిని తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన దీపిక.. బాధ, మానసిక ఒత్తిడి అనేవి రెండు వేర్వేరని అభిప్రాయపడింది. ఆ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది.
- — Deepika Padukone (@deepikapadukone) June 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Deepika Padukone (@deepikapadukone) June 19, 2020
">— Deepika Padukone (@deepikapadukone) June 19, 2020
దేశవ్యాప్తంగా...
దీపిక.. 2015లో 'ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' (టీఎల్‌ఎల్‌ఎల్‌ఎఫ్)ను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా మానసిక ఆరోగ్యం, దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇదీ చూడండి... 'ఆమెతో విడిపోయినందకు సుశాంత్ చాలా బాధపడ్డాడు'