ETV Bharat / sitara

KGF 2: యశ్​ 'కేజీఎఫ్ 2' విడుదలపై క్లారిటీ! - Yash Kgf 2 release

కన్నడ స్టార్​ యశ్(Yash) హీరోగా తెరకెక్కిన 'కేజీఎఫ్ 2'(KGF 2) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. కరోనా కేసులు తీవ్రతను, థియేటర్ల పరిస్థితుల్ని అంచనా వేచి సెప్టెంబరు 9న రిలీజ్​ చేయాలని భావిస్తున్నారట!.

yash
యశ్​
author img

By

Published : Jun 24, 2021, 6:36 AM IST

ఈ ఏడాది ప్రేక్షకులు... పరిశ్రమ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'కె.జి.ఎఫ్‌2'(KGF 2). రాఖీ భాయ్‌గా మరోసారి యశ్‌(Yash) చేయనున్న సందడిని ఆస్వాదించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. విజయవంతమైన 'కె.జి.ఎఫ్‌'కు కొన సాగింపుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనాతో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీపై దృష్టిపెట్టారు.

కరోనా కేసుల తీవ్రతను...థియేటర్ల దగ్గర పరిస్థితుల్ని అంచనా వేస్తూ విడుదలకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావడం, నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకోవడం వల్ల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది చిత్రబృందం. సెప్టెంబరు 9న చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

మరి సినీ వర్గాలు అదే రోజునే విడుదలను ఖరారు చేస్తుందా? నిర్ణయం మార్చుకుంటుందా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే! ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.

ఇదీ చూడండి: 'కేజీఎఫ్​' హీరో హత్యకు కుట్ర పన్నిన రౌడీ ఎన్​కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.