ETV Bharat / sitara

'నువ్వే కావాలి' నా జీవితంలో ఓ మైలురాయి: భువనచంద్ర - song writer bhuvana chandra

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో, తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. మంగళవారానికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా గీత రచయిన భువన చంద్ర, కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

nuvve kavali
నువ్వే కావాలి
author img

By

Published : Oct 10, 2020, 3:48 PM IST

Updated : Oct 10, 2020, 4:23 PM IST

భువన చంద్ర.

'నువ్వులేక నేనులేను', 'నువ్వే.. నువ్వే', 'ఎలా చెప్పను', 'ప్రియమైన నీకు' లాంటి అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు హీరో తరుణ్​. ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 'నువ్వే కావాలి'లో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 13తో 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా గీత రచయిత భువనచంద్ర, చిత్రవిశేషాలు కొన్నింటిని వెల్లడించారు.

"ఈ చిత్రం కోసం హ్యాపీగా సాగిపోయే పాటలు కావాలని దర్శకుడు విజయ్​ భాస్కర్​ అన్నారు. ఒక్క చిన్న సంఘటనను ఉదాహరణగా చెప్పారు. అమ్మమ్మ తాతయ్య తరం వాళ్లు ఈ తరం వాళ్లకు మంచి సూక్తులు చెప్తుంటే వారు పెడచెవిన పెడుతుంటారు. దీన్ని ఆధారంగా ఓ పాట ఉండాలని అన్నారు. అలా 'వుయ్​ వాంట్​ ఫ్రీడమ్​' పాట రాశాను. చాలా మంచి పాట ఇది. రెండో పాట షుక్రియా(థ్యాంక్యూ) పాటను చిత్రమైన పద్ధతిలో రాశాం. ఈ పాట విన్నవారికి అది అర్థమవుతుంది. కానీ లైలా పాట మాత్రం చాలా జాగ్రత్తగా రాశాను. ఇందులో శృంగారతనం ఉండదు కానీ అల్లరితనం, నాటీనెస్​ కనిపిస్తుంటాయి. కుటంబ కథ చిత్రం కాబట్టి ఇలాంటివి పాటలో ఉండటం ఏంటి అని ఈ చిత్రాన్ని నిర్మించిన రామోజీరావు ఏమైనా అంటారేమోనని ఒళ్లు దగ్గరపెట్టుకుని చాలా జాగ్రత్తగా రాశాను. మొత్తంగా ఇందులోని ప్రతిపాట ఓ అద్భుతం. ఇది యూత్​ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​. నా సినీ జీవితంలో ఇది ఓ మైలురాయి చిత్రం" అని భువన చంద్ర చెప్పారు.

హీరోగా సినిమా ప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న తరుణ్​కు ఓ గొప్ప విజయాన్ని అందించింది 'నువ్వే కావాలి'. కాలేజీ చదువులు, స్నేహం విలువ, నైతికత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటీనటుల పాత్రాభినయం ఒకెత్తయితే... సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇదీ చూడండి 'నువ్వే కావాలి' ఓ ట్రెండ్ సెట్టర్: కోటి

Last Updated : Oct 10, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.