ETV Bharat / sitara

'నేనింకా చిన్నోడినే కదా.. అప్పుడే పెళ్లేంటి?'

సినీ వినీలాకాశంలో ఈమధ్యే వెలిగిన ధ్రువతార... విజయ్‌ దేవరకొండ. ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. చూస్తుండగానే పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు విజయ్‌. తన సినిమాలు, స్టైల్‌, మాట్లాడే తీరు.. ఇవన్నీ యువతరాన్ని ఇట్టే ఆకర్షిస్తుంటాయి. అతడు నటించిన 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' ప్రేమికుల రోజున విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్​ దేవరకొండ పంచుకున్న ఆసక్తికర విశేషాలివే..

WORLD FAMOUS LOVER_vijay devarakonda-special-interview
'ఒక తరాన్ని మార్చగలనని అర్ధమైంది'
author img

By

Published : Feb 12, 2020, 8:11 AM IST

Updated : Mar 1, 2020, 1:30 AM IST

'పెళ్లి చూపులు', 'అర్జున్‌ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో ఒక్కసారిగా ఫేమస్​​ అయిన విజయ్​ దేవరకొండ... ఇప్పుడు 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ పంచుకున్న ముచ్చట్లివే..

బంతి గాల్లో ఉంది

"ఏ సినిమా అయినా సరే... సిక్సర్‌ కొట్టాలనుకుంటా. ఈసారీ అలానే బంతిని బలంగా బాదేశాను. అయితే ప్రస్తుతానికి బంతి గాల్లో ఉంది. అది సిక్సో, క్యాచ్‌ అవుటో.. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి. సాధారణంగా నా ప్రతి చిత్రం విడుదల ముందు కాస్త ఎక్కువ మాట్లాడతా. కానీ, ఈ సినిమాకి తక్కువ మాట్లాడాను. అయినా జనంలో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ఎక్కువగా కనిపించింది. అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది".

WORLD FAMOUS LOVER_vijay devarakonda-special-interview
విజయ్​ దేవరకొండ

ఎంత ప్రేమ ఉంటే..

"నాపై వచ్చే ట్రోల్స్​నూ ఇష్టపడుతుంటా. ఓ వ్యక్తి నన్ను ఎంతగా ప్రేమిస్తే ట్రోల్‌ చేస్తాడో అనిపిస్తోంది. జనం మన గురించి మాట్లాడుకోవాలి, వాళ్ల టాపిక్‌ మనమైపోవాలి. రివ్యూలూ అంతే. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. అంతే తప్ప.. రొటీన్‌గా ఉండకూడదు. అలాంటి విశ్లేషణల్ని నేను పెద్దగా పట్టించుకోను"

పోలిక మంచిదే..

"సైన్స్‌ ఫిక్షన్‌ చేసినా, యాక్షన్‌ సినిమా చేసినా... కాస్త గెడ్డం పెంచితే చాలు, 'అర్జున్‌రెడ్డి'తో పోల్చేస్తారు. అదీ మంచికే. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లోని కొన్ని సన్నివేశాలు 'అర్జున్‌రెడ్డి'ని గుర్తుచేస్తాయి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇలాంటి కథ ఇప్పటి వరకూ రాలేదు. కనీసం తెలుగు సినిమా వరకైనా ఈ జోనర్‌ కొత్త."

ఎందుకు వద్దన్నానంటే..

"వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' నా చివరి ప్రేమకథా చిత్రం అని చెప్పాను. అలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. నా జీవితంలో చాలా మార్పులొస్తున్నాయి. రంగురంగుల దుస్తులే వేసుకోవాలనిపిస్తుంది. ఈ సినిమాకి ముందు విన్న ప్రేమకథలు ఏమాత్రం రుచించలేదు. పైగా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లో మూడు విభిన్నమైన ప్రేమ కథలున్నాయి. ఇక ప్రేమలో ఏముందో అన్నీ చెప్పేశానేమో అనిపించింది. ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఓ చోట ప్రేమ ఉంటుంది. కానీ పూర్తి స్థాయి లవ్​ చిత్రాలు చేయను."

మా నాన్నగార్ని చూసి..

"ఈ సినిమా కోసం పడిన కష్టం... ఇదివరకెప్పుడూ పడలేదు. ఇందులో నా పాత్ర మూడు కోణాల్లో కనిపిస్తుంది. ఒక్కో పాత్రకూ ఒక్కో గెటప్‌ ఉంటుంది. అందుకే షెడ్యూల్స్‌ మధ్య ఎక్కువ విరామం వచ్చింది. శీనయ్య క్యారెక్టరైజేషన్‌ బాగా నచ్చింది. ఈ పాత్ర కోసం మా నాన్నని ఫాలో అయ్యాను. అతను లుంగీ ఎక్కువగా కట్టేవాడు. పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆయన హావభావాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గుర్తు చేసుకునేవాడిని. దాన్నే అనుకరించాను".

యూట్యూబ్‌లో చూసి..

"నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా 'డియర్‌ కామ్రేడ్‌'. ఇక్కడ మంచి రివ్యూలు రాలేదు. అయితే ఈ సినిమా చేరాల్సిన వాళ్లందరికీ చేరింది. ముంబయిలో షూటింగ్‌కి వెళ్తే... నన్ను 'బాబీ' అని పిలుస్తున్నారు. యూట్యూబ్‌ పుణ్యమా అని దేశ విదేశాల్లో ఈ సినిమాని చూశారు. నా నటనకు మంచి పేరొచ్చింది. అవార్డులూ దక్కాయి. మనం ప్రేమించి ఓ సినిమా చేస్తే.. అది ఏదో రూపంలోనైనా ప్రేక్షకులకు చేరుతుంది. అందుకు 'డియర్‌ కామ్రేడ్‌' ఓ ఉదాహరణ"

ఇంకా చిన్నవాడినే

"ఇది వరకు ప్రేమంటే అర్థం లేని విషయం అనుకునేవాడిని. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపాదించినా, ఖర్చు పెట్టినా... ఇంట్లో మన కోసం ఒకరు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు నేను ఎదిగాను. ఇంట్లోవాళ్లకు సలహాలూ ఇస్తున్నాను. కానీ వాళ్లు పెళ్లి పేరెత్తితే మాత్రం.. 'నేను ఇంకా చిన్నవాడినే కదా' అనిపిస్తోంది".

ఒక తరాన్ని మార్చగలను!

"చిన్నప్పటి నుంచి మనం రకరకాల భయాలతో పెరిగినవాళ్లమే. నేను సినిమాల్లోకి వస్తానంటే.. 'ఎందుకు, డబ్బులు పోతాయి.. నాన్నకి కలసి రాలేదు.. నీకూ అంతే' అని అందరూ భయపెట్టారు. అవన్నీ వదిలేసి నేను యాక్టర్​ అయ్యా. చాలా విషయాల్లో దూకుడైన నిర్ణయాలు తీసుకున్నా. పాన్‌ ఇండియా సినిమా చేసినా, 'రౌడీ' బ్రాండింగ్‌ మొదలెట్టినా, సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నా... 'నేనెందుకు చేయకూడదు' అనే ప్రశ్నే నన్ను నడిపించింది. నా ఆలోచనలు, నా మాటలు ఓ తరాన్ని ప్రభావితం చేయగలవు. 'విజయ్‌ దేవరకొండలా ధైర్యంగా మాట్లాడాలని' పిల్లలు అనుకుంటే నేను మార్పుకి ఓ కారణం అయినట్టే".

ఇదీ చూడండి.. ఇక ప్రేమ కథలు తీయను: విజయ్

Last Updated : Mar 1, 2020, 1:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.