వార్నర్ బ్రదర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'వండర్ ఉమెన్ 1984' చిత్రం విడుదల తేదీని గురువారం అధికారికంగా ప్రకటించారు. డిసెంబరు 25న హెచ్‌బీవో మ్యాక్స్ స్ట్రీమింగ్ యాప్‌తో పాటు అదే రోజు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచవ్యాప్తంగా తెరుచుకున్న థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ తెలిపింది. అయితే కరోనా మహమ్మారికి కారణంగా కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్న తరుణంలో అలాంటి వారి కోసం ఓటీటీలో వీక్షించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది.