ETV Bharat / sitara

విమెన్స్​ డే స్పెషల్: సినీలాకాశంలో మెరుస్తున్న తారలు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఒకప్పుడు సినిమాలో హీరోయిన్‌ని అందాల ఆరబోత కోసమే చూపించేవారు. ఇప్పుడు కాలం మారింది. తారల తలరాత మారింది. సామాజిక మాధ్యమాలనే ఆమె అస్త్రాలను చేసుకుని సినీ ప్రపంచాన్ని ఏలుతోంది. 'మీ టూ'తో వంకరగా చూసే వారి వెన్నులో దడ పుట్టిస్తూ..గౌరవంగా బతుకుతోంది.

women-situation-in-movies-in-telugu
ఉమెన్స్​ డే స్పెషల్: సినీలాకాశంలో మెరుస్తున్న తారలు
author img

By

Published : Mar 8, 2021, 4:07 PM IST

Updated : Mar 9, 2021, 11:56 AM IST

సినిమా రంగంలో పనిచేసే మహిళలు అనగానే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. నేటికీ కొందరిలోనూ ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లను సినిమా రంగంలోకి పంపడానికి జంకుతారు. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి మారింది. తారలు గౌరవంగా ఉండే స్థాయికి చేరుకున్నారు.

ఆమెకూ ప్రాధాన్యం...

ఒకప్పుడు సినిమా తారల పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవుట్ డోర్ షూటింగ్​లకి వెళ్లినపుడు వాష్​ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ కూడా లేని పరిస్థితి ఉండేదని సీనియర్ కథానాయికలు ఎందరో చెప్పారు. కానీ నేటి తారలకు ఆ దుస్థితి లేదు. హీరోయిన్లు కొన్ని సౌకర్యాలను ధైర్యంగా అడగగలుగుతున్నారు. వారి గౌరవానికి భంగం కలగకుండా పనిచేసే స్థాయికి ఎదిగారు. నాడు స్టార్‌డం అంటే కేవలం హీరోలకే మాత్రమే ఉండేది. తెరపై, తెర వెనుక కథానాయకులకే అధిక ప్రాధాన్యం ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న ఎన్నో పాత్రలను తెరపై చూడొచ్చు.

వెన్నుల్లో వణుకు పుట్టించే 'మీటూ'

తార అనగానే పబ్లిక్ ఫిగర్ అనేకునే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక వాళ్లతో పనిచేసే వ్యక్తుల నుంచి చేదు అనుభవాలు ఎదుర్కొన్న పరిస్థితులను ఎందరో కథానాయికలు తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారింది. గౌరవంగా ఉంటూ సినిమాల్లో సంతోషంగా నటిస్తున్నారు. కథానాయిక తను పాత్రను తాను నిర్ణయించుకునే స్థాయికి చేరింది. తనకు నచ్చని సన్నివేశాలను నిరభ్యంతరంగా తిరస్కరిస్తోంది. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాటిని పంచుకోవడానికి అనేక వేదికలొచ్చాయి. మీ టూ వంటి ఉద్యమాలు హీరోయిన్లను వంకరగా చూసే వారి వెన్నులో వణుకు పుట్టించాయని చెప్పొచ్చు.

ఎన్నో సవాళ్ల మధ్య...

మహిళా సాధికారత గురించి ఎంత చెప్పినా... ఎక్కడో ఒకచోట ఆమెను వంకరంగా చూసే జనాలు లేకపోలేదు. మహిళ బయటకు వెళ్తే చాలు ఆమెను ఎన్నో కళ్లు జడ్జ్ చేస్తాయి. అయితే ఆ కళ్లకు భయపడే స్థితిలో నేటి మహిళ లేదు. అలాంటి వేల కన్నులను ఎదిరించే శక్తి ఆమెలో ఉందని తెలుసుకుంది. గృహిణిగా కాకుండా వర్కింగ్ ఉమెన్​గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నేటి మహిళ దూసుకుపోతుంది.

మహిళా దినోత్సవం రోజు ఆమెకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్లేదు... మిగతా రోజుల్లోనూ ఆమె మీకంటే ఏమాత్రం తక్కువ కాదని గుర్తిస్తే చాలని నేటి మహిళ కోరుకుంటోంది.

ఇదీ చదవండి: సీబీఐటీ విద్యార్థుల జోష్​... వేడుకల్లో అల్లరి నరేశ్​

Last Updated : Mar 9, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.