అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్స్ వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ తండ్రి రిచర్డ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ది కింగ్ రిచర్డ్'. ఇందులోని రిచర్డ్ పాత్రను విల్‌స్మిత్ పోషిస్తున్నాడు. రొనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నిజజీవిత ఆటగాళ్లయిన జాన్ మెకెన్రో, పీట్ సంప్రాస్.. ఈ సినిమాలో అదే పాత్రల్లో కనిపించనున్నారు. వీనస్‌గా సన్నియా సిడ్నీ, సెరెనా పాత్రలో డెమి సింగిల్‌స్టోన్ నటిస్తోంది. జనవరిలో లాస్ ఏంజెల్స్‌లో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.
ఇదీ చూడండి.. ఆ మూడు రోజులు 24x7 నాన్‌స్టాప్ షోలు