ETV Bharat / sitara

ప్రభాస్​తో మరోసారి కలిసి పనిచేస్తా: రాజమౌళి - ప్రభాస్​ రాజమౌళి వార్తలు

సరైన కథ దొరికితే ప్రభాస్​తో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమని అన్నారు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' చిత్రీకరణ సమయంలో తామిద్దరి మధ్య మరింత అనుబంధం పెరిగిందని.. తమ కాంబినేషన్​లో కచ్చితంగా మరో చిత్రం వస్తుందని జక్కన్న స్పష్టం చేశారు.

Will definitely do a film with Prabhas: SS Rajamouli
ప్రభాస్​తో మరోసారి కలిసి పనిచేస్తా: రాజమౌళి
author img

By

Published : Dec 2, 2020, 8:48 PM IST

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'బాహుబలి'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా రికార్డులూ సృష్టించింది. 'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్‌-రాజమౌళి ఎవరి ప్రాజెక్ట్‌లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌ మరో సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో కలిసి మరోసారి పనిచేయడంపై తాజాగా రాజమౌళి స్పందించారు.

Will definitely do a film with Prabhas: SS Rajamouli
ప్రభాస్​, రాజమౌళి

"బాహుబలి' కోసం ఐదేళ్లు కలిసి పనిచేయడం వల్ల మా మధ్య అనుబంధం మరింత పెరిగింది. అయితే, మా ఇద్దరిలో ఆసక్తి రేకెత్తించే కథ సిద్ధమైతే.. తప్పకుండా మరోసారి కలిసి పని చేస్తాం."

- ఎస్​ఎస్​ రాజమౌళి, దర్శకుడు

తారక్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రానున్న 'ఆర్‌ఆర్ఆర్‌' చిత్రాన్ని ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. మరోవైపు ప్రభాస్‌ కథానాయకుడిగా 'రాధేశ్యామ్‌' రూపొందుతుంది. కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. దీనితోపాటు 'ఆదిపురుష్‌', నాగ్‌ అశ్విన్‌ సినిమాలతో పాటు కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో 'సలార్​' చిత్రాలతో ప్రభాస్​ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: ప్రభాస్​తో ప్రశాంత్​ నీల్.. అధికారిక ప్రకటన, అదిరే టైటిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.