ETV Bharat / sitara

'స్లమ్​డాగ్ మిలియనీర్'లోని ఆ పాత్రకు షారుక్ నో? - స్లమ్​డాగ్​ మిలీయనీర్'లో ఓ పాత్ర తిరస్కరించిన షారుక్​

ఆస్కార్​ అవార్డు అందుకున్న 'స్లమ్​డాగ్​ మిలియనీర్​' సినిమాలోని ఓ పాత్ర కోసం దర్శకుడు డానీ బోయెల్ బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ను​ సంప్రదించారు. అయితే దాన్ని షారుక్​ సున్నితంగా తిరస్కరించారు. ఆ పాత్ర ఏంటి? ఎందుకు తిరస్కరించారో తెలియాలంటే ఈ కథనం చదివేయండి.

sharukh
షారుక్​
author img

By

Published : Jul 2, 2020, 5:56 AM IST

Updated : Jul 2, 2020, 8:56 AM IST

దేశవ్యాప్తంగా విశేషాదరణ పొందిన ఆస్కార్​ అవార్డు సినిమా 'స్లమ్​డాగ్​ మిలియనీర్'. ఈ చిత్రంలోని ఓ గేమ్​ షోకు హోస్ట్​గా వ్యవహరించే ప్రేమ్​కుమార్​ పాత్రలో బాలీవుడ్​ ప్రముఖ నటుడు అనిల్​కపూర్​ నటించారు. ఈ పాత్రలో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే ఈ హోస్ట్ పాత్రలో స్టార్​ హీరో షారుక్​ ఖాన్ వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి?

అవును మీరు విన్నది నిజమే. అనిల్​కపూర్​ కన్నా ముందు ఈ పాత్రకు షారుక్​ను సంప్రదించారు ఆ చిత్ర దర్శకుడు డానీ బోయెల్‌. దీని కోసం ఇద్దరు కలిసి కొంతకాలం కూడా పనిచేశారు. కానీ అనంతరం ఆ పాత్ర చేయనని వెనక్కి తగ్గారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని వివరించారు షారుక్​. పాత్ర నిడివి తక్కువ ఉండటం, కొంచెం మోసపూరితమైనదిగా అనిపించడం వల్ల తిరస్కరించినట్లు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా కథ

ముంబయి మురికివాడ ధారావిలోని దుర్భరమైన పిల్లల జీవితం నేపథ్యంలో తెరకెక్కింది స్లమ్​డాగ్​ మిలియనీర్​. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవటమే కాకుండా కమర్షియల్‌గానూ సూపర్‌ హిట్ అయింది. ఆస్కార్‌ బరిలోనూ సత్తా చాటింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్‌, బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌ కేటగిరిలో నామినేట్‌ అయింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు దక్కింది. ​

ఇది చూడండి : ఆ పాత్ర కోసం విద్యాబాలన్​ 75సార్లు ఆడిషన్!

Last Updated : Jul 2, 2020, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.