నందమూరి తారక రామారావు.. తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు విగ్రహంలా కనిపిస్తారు. సినీ రాజకీయరంగంలో తనదైన ముద్రవేసిన నటసౌర్వభౌముడు 'మనదేశం' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి.. తారక రాముడిని మనకు పరిచయం చేసిన సీ కృష్ణవేణి పుట్టినరోజు నేడు.
తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. బాలనటిగా అడుగుపెట్టిన ఆమె... ఓ గొప్ప నటుడ్ని తెరకు పరిచయం చేసే అదృష్టాన్ని పొందింది. పారితోషికంగా రూ.250 చెక్కును ఆమె చేతుల మీదుగానే రామారావు తీసుకున్నారు.
ఇదీ చదవండి: 'త్రీ ఇడియట్స్' స్నేహ కావ్యానికి పదేళ్లు